దేశభక్తి
నువ్వు నీ మతాన్ని ప్రేమించు
నీ దేవున్ని ప్రార్థించు
భక్తి కావాలి నీకు కాదనను
కాని నీ మతం కన్న
నీ దేవుని కన్న
నీ దేశం గొప్పది
నీకు దేశభక్తి కావాలి
మనిషివి నీవు
శూన్యంలో బతుకడం లేదు
నిర్జీవమైన ఏ గ్రహం మీదనో బతుకడం లేదు
కూడు గుడ్డ నీడనిస్తున్న
ఈ తల్లి ఒడిలోనే బతుకుతున్నావు
అన్నం పెట్టే తల్లి చెయ్యినెవరైనా నరికేస్తారా?
స్తన్యమిస్తున్న తల్లి రొమ్మునే కోసేస్తారా?
నీ అన్ననో, అక్కనో, అమ్మనో, చెల్లినో, పాపనో, బాబునో నిర్దాక్షిణ్యంగా నిలువునా చంపేస్తారా?
కూడు, గుడ్డ , నీడనిస్తున్న ఈ విశాల ధాత్రిని బాంబులతో, మారణాయుధాలతో నింపుతారా?
సమస్త మానవ జాతి చరిత్రలో నెత్తురు కూడు
తిన్న వాడెవ్వడైనా ద్రోహిగానే మిగిలాడు
చరిత్ర ద్రోహులను క్షమించదు
మతం మంచిని చెప్పాలి, మానవత్వం చెప్పాలి
సమతను చెప్పాలి, శాంతిని చెప్పాలి
అది ఆర్తుల కన్నీళ్ళు తుడువాలి
మతం కావాలి నాయనా నీకు కాదనను
కాని మతం కన్నా, దేవుడి కన్నా
దేశం గొప్పది
నీకు దేశభక్తి కావాలి.
డా. సబ్బని లక్ష్మీనారాయణ
6-6-302, సాయినగర్, కరీంనగర్ -505001.
మొబైల్ : 8985251271
email: ln.sabbani@gmail.com
--------------------------------------------------------------------------------------------------------------------------
Call 89852 51271 @ EDITOR Dr. Sabbani Laxminarayana
Call 9849250784 for more details on Book.
-----------------------------------------------------------------------------------------------------


ఐక్యత, జాతీయ సమైక్యతలు, దేశభక్తి లు ప్రధానము.అద్భుతమైన కవిత్వం.అభినందన.
ReplyDelete