(Bharat Ki Azadi Ka Amruth Mahotsav)
వీర పుత్రులు గన్న
పల్లవి:వీర పుత్రులు గన్న వసుంధరీ ఈ జననీ..
ధీర పుత్రులు వున్న పురంధరీ ఈ అవనీ..
చరణం1:త్యాగాల నా తల్లి తనువెల్లా రగిలింది
బానిసత్వ బతుకుల్లో బాధల్ని మ్రింగింది
కష్టాల కడలిలో కన్నీరు కార్చింది
చెరసాల చెలిమిలో చరితల్ని రాసింది
//వీరపుత్రులు//
చరణం2:శరాలను సంధించిన విరోచిత పోరాటం
శరీరాలు బంధించినా ఆకాంక్షల ఆరాటం
అల్లూరి సారథిగా అడుగేసిన వెలుగుబాట
తెల్లోడి గుండెల్ని వణికించిన తెలుగుపాట
//వీరపుత్రులు//
చరణం3:సత్యాగ్రహ శాంతిదూత గాంధీజీ నెహ్రూజీ
వీరగాధ ఛత్రపతి శివమెత్తిన శివాజీ
మీసాలను మెలిపెట్టిన భగత్‌సింగు సుభాసు
మోసాలను కనిపెట్టిన భరతమాతే శెభాసు
//వీరపుత్రులు//
చరణం4:భాదించిన పరతంత్రం స్వేచ్ఛా హృది ఆర్తి
సాధించిన స్వాతంత్రం విరజిమ్మిన త్యాగ దీప్తి
అలుపెరగని ధీరత్వం అదే మన దేశ స్ఫూర్తి
మువ్వన్నెల జెండాతో మురిసింది జాతి కీర్తి
//వీర పుత్రులు//
డా.రచన:కటుకోఝ్వల రమేష్
సెల్:9949083327
--------------------------------------------------------------------------------------------------------------------------
Call 89852 51271 @ EDITOR Dr. Sabbani Laxminarayana
Call 9849250784 for more details on Book.
-----------------------------------------------------------------------------------------------------


No comments:
Post a Comment