" స్వతంత్ర భారత అమృత మహోత్సవాల సందర్భంగా వెలువడబోతున్న కవితా సంకలనానికై కవిత :
అంశం : దేశభక్తి + జాతీయ సమైక్యత
నేను సైతం...
స్వేచ్ఛ కావాలనే ఆరాటం
పోరాటానికి తొలి అడుగు...
దౌర్జన్యం స్వైరవిహారిస్తే
గరికపోచలూ మెరికలై
పూరిస్తాయి పాంచజన్యం...
మట్టితల్లిని మక్కువతో ప్రేమిస్తూ
అక్కున చేర్చుకునేవాడు
హక్కుని విస్మరించలేడు కదా...
దేశ దేహ స్మరణలో
జాగరూక చూపులతో
భద్ర వాతావరణానికై
రణ నిబద్ధతతో
ఆర్ధ్రతతో సంచరిస్తాడు...
చతికిలపడ్డ గుండెలపై
నా తెగింపు జెండా ఎగరాలి...
మండే కళ్ళ గోళాల్లో
నిండు ధైర్యం ప్రస్ఫుటించాలి...
నా దేశం నాది కావాలి
ప్రాణ త్యాగంలో
నేను ' ఆది ' కావాలి !
గుండాన జోగారావు
సింహాచలం
6302718715
హామీపత్రం
నమస్కారం. కవిత స్వంతం.
అనువాదం అనుసరణా కాదు.
ఏ పత్రిక్కీ పంపించలేదు.
ఏ సామాజిక మాధ్యమాలలో
ప్రచురితం కాలేదు. మీకు ప్రత్యేకం. శుభాకాంక్షలతో...
మీ... గుండాన జోగారావు
Address
Gundana Joga Rao
Road no. 7, Door no. 6-253/6
Sri SAINAGAR colony
Post : SIMHACHALAM
VISAKHAPATNAM-530028
Mob : 6302718715
gundanajogarao@gmail.com
--------------------------------------------------------------------------------------------------------------------------
Call 89852 51271 @ EDITOR Dr. Sabbani Laxminarayana
Call 9849250784 for more details on Book.
-----------------------------------------------------------------------------------------------------


No comments:
Post a Comment