(DESH BHAKTI)

ఆదర్శ పథగామి నా దేశం
************************
అచంచల ఆత్మవిశ్వాస స్ఫూర్తి నాభూమి
కన్ను గానని విదేశీ పాలకుల వికృతాలు
రాజ్య మదాంధుల దుష్కృతాలు
అసూయతో ఈదేశం వైపు చూసిన కళ్ళు
మానవతను మరిచి, స్వార్థపరత్వంతో
సంపదలు కొల్లగొట్టినా
ఈనేల సమగ్రతా రూపాన్ని
శిథిలం చేయబూనినా
స్వేచ్ఛా వాయువుల కోసం
కునుకు లేకుండా
ఎదురుచూసిన
అసామాన్యమైన సంయమనం
చీలికలెన్నైనా వీడని ఐకమత్యం
సాధించునంత దనుక ఆగని పోరాట పాటవం
పేద దేశమని పెదవి విరిచినా
వెనుకబడిన తనమని వెక్కిరించినా
అల్పులని అవమానించినా
విజయదరహాసమే సమాధానం
సర్వమతాలు, సకల కులాలు,
వివిధ భాషలు, విభిన్న భావనలు
అనేక సంస్కృతులు, అశేష సంప్రదాయాలు
మాటలకందని మమతలు ఏకమై
ఆకాశంలో విరిసిన హరివిల్లు నాదేశం
వెనుకడుగు మా వారసత్వం కానేకాదు
వెన్నుపోటు మా గుణం అసలే కాదు
సహనశీలత మాకు అలంకారం
సామరస్యం మా ఆభరణం
విజయసోపానాల అధిరోహణలో
ఏ రంగమైనా అంతరంగమొక్కటే
పలుచన కాబడిన ప్రపంచంలో
దిక్కులన్నిట కీర్తి బావుటా ఎగరేసి
ఉజ్వల భావితేజమై
సాగిపోతోంది నాదేశం సగర్వంగా
ఆదర్శ పథగామియై
జై హింద్!!!
******************
అరుణ ధూళిపాళ
తెలుగు విభాగాధిపతి
&
వైస్ -ప్రిన్సిపల్
శ్రీ చైతన్య విద్యాసంస్థలు
హైదరాబాద్
తెలంగాణ
ఫోన్ నంబర్ : 8712342323
--------------------------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------------------------------------------------------
Call 94410 89035 @ EDITOR - M N VIJAYA KUMAR
Call 9849250784 for more details on Book.
to join us ...click here
https://chat.whatsapp.com/EiIOZhl7ZMwEzWFFwtZlJv
-----------------------------------------------
Let's celebrate Independence day to salute nation with our own words in edited book DESH BHAKTI by M N VIJAYA KUMAR
Don't miss this golden opportunity to salute nation with your own writing in your own language..
Please join and share with your friends....
Let's dedicate our pen for nation....
GENERAL poems theme in Hindi, or English or Telugu
Membership to join
Just 500.00
Members will be given
2 Books with ISBN, Blog page, Youtube video
Let's gain Name and Fame in single click...
https://chat.whatsapp.com/EiIOZhl7ZMwEzWFFwtZlJv
Call 9849250784 for more information
-----------------------------------------------------------------------------------------------------