(Bharat Ki Azadi Ka Amruth Mahotsav)
అమ్మా భారతావని
నిండు పున్నమిలా ప్రకాశించు నీవు
నవరత్న ఖచిత సింహాసనాధీశ నీవు
రామాయణ భారత భాగవతాది కావ్యాలు
ముద్దుగా మురిపించు ముత్యం నీవు
నన్నయ తిక్కన ఎఱ్ఱన పోతన
కేతనామాత్యుల కీర్తి నొసంగిన కెంపు నీవు
చరక చాణక్య శుశ్రుత గౌతమాది మహామహుల
పాఠవములు పరిఢవిలు పగడం నీవు
వ్యాస వాల్మీక మునులంతా దేదీప్యమానమై వడ్డానముగా శోభిల్లు వజ్రం నీవు
హరితవర్ణంతో నిత్యము శోభాయమానంగా
సాగేటి నాగళ్ళు ఘల్లు ఘల్లు మంటు
పుత్తడులు పుష్పించు పుష్యరాగం నీవు
గంగా యమునా బ్రహ్మపుత్రాది నదులన్నీ
నిండుకుండలా తొణికిసలాడు నీలంనీవు
వేద వేదాంగోపనిషత్తులు విలక్షణంగా ప్రకాశించు
విలువైన గ్రంథాలపచ్చనీవు
భిన్నమత నిలయమై భాసిల్లు వైడూర్యం నీవు
యజ్ఞయాగాది గోవాష్వ సంపద
గొప్పగాగల గోమేధికం నీవు
నిర్మలనదుల నిలయ భారతావనికి వందనం
కోడెపాక అరుణాదేవి
వృత్తి: ఉపాధ్యాయులు
చిరునామా:2-7-1244/1
వడ్డేపల్లి ,హనుమకొండ జిల్లా
తెలంగాణ.
91771 45289
--------------------------------------------------------------------------------------------------------------------------
Call 89852 51271 @ EDITOR Dr. Sabbani Laxminarayana
Call 9849250784 for more details on Book.
-----------------------------------------------------------------------------------------------------


No comments:
Post a Comment