Friday, July 15

నా దేశం అగ్ని పునీత - వి. సూర్యారావు (Bharat Ki Azadi Ka Amruth Mahotsav)

(Bharat Ki Azadi Ka Amruth Mahotsav)


నా దేశం అగ్ని పునీత 

నా దేశం త్యాగాల అగ్ని పునీత
దేశ సమైక్యతకి నిలువుటద్దం
స్వేచ్ఛ కోసం, స్వాతంత్ర్య కోసం చేసిన నిర్విరామ త్యాగాలు 
జైళ్లల్లో మగ్గుతూ కొందరు
కొరడా వాతల దేహాలతో కొందరు 
తుపాకీ తూటాలకి అసువులు బాసి కొందరు
స్వాతంత్ర్య పోరు బాటలో  ఆస్తులని కోల్పోయిన వాళ్ళు భార్యా బిడ్డల్ని కోల్పోయిన వాళ్ళు 
తల్లుల్ని కోల్పోయిన బిడ్డలు
బిడ్డల్ని కోల్పోయిన తల్లులు 
శీలం కోల్పోయిన వనితలు 
జలియన్ వాలా బాగ్ లో 
కాలువలై పారిన నెత్తురు 
సర్వం పోగొట్టుకున్న నిస్వార్థ త్యాగ ధనులు
మహాత్మా గాంధీ అహింసా మార్గం
నేతాజీ ఉద్యమ స్పూర్తి
ఉరి కొయ్యకి వేలాడిన భగత్ సింగ్ 
బ్రిటిష్ గుండ్లకు బలిగా అల్లూరి సీతారామరాజు 
నాటి స్వాతంత్య్రోద్యమ దేశభక్తి 
నాటికీ నేటికీ శాశ్వతంగా ఊదిన గుండె ఊపిర్లు
రెండొందల ఏళ్ళు సాగిన దోపిడీ
వందేళ్ల త్యాగాల పోరుతో అంతం 
ఇప్పుడు నా దేశం  అగ్ని పునీత ! 


వి. సూర్యారావు
92469 11234

--------------------------------------------------------------------------------------------------------------------------

Call 89852 51271 @ EDITOR Dr. Sabbani Laxminarayana 

Call 9849250784 for more details on Book. 

-----------------------------------------------------------------------------------------------------


scan to see on youtube



scan to join on WhatsApp




BOOK PUBLISHED BY :

GEETA PRAKASHAN

INDIA

Cell 98492 50784

geetaprakashan7@gmail.com

---------------------------------------------------------------------------------

do you want to publish your writing through our BLOGPAGE ?

Please call us 62818 22363 

No comments:

Post a Comment

विघ्नेश्वर - पोतराज श्रीनिवास राव (Geeta Prakashan Bookswala's Anthology "प्रहरी अक्षरों का")

  (Geeta Prakashan Bookswala's Anthology "प्रहरी अक्षरों का")     विघ्नेश्वर 💐...................💐 संकट हरण है विघ्नेश्वर दू...