(Bharat Ki Azadi Ka Amruth Mahotsav)
భారత దేశం ఒక పుణ్యక్షేత్రం
ప్రపంచంలోనే గొప్ప దేశం భారతదేశం
త్యాగాలు, సంప్రదాయాలకు పేరున్న దేశం,
ప్రేమ- అభిమానాలకు,శాంతి, సమానతలకు ,
పురుడు పోసి పేరు పెట్టిన మాత్రుభూమి ,
నాదేశం భారత దేశం,
పేద -ధనిక కుల మతాలకు,
తావివ్వకుండా, వ్యక్తిత్వాలను గౌరవించే,
పుణ్య దేశం నా దేశం.
దేశ భక్తులకు జన్మనిచ్చిన దేశం,
సరోజినీ, సావిత్రీ బాయి,
ఝాన్సీ రాణి ఇందిరా గాంధీ లాంటి ,
వీర మణులను ముందుంచి ,
స్పూర్తి వెలుగులను చూపించిన దేశం,
గడప దాటని ఆడవారిని,
చదువు అనే వెలుగు తో గడప దాటించి,
ధైర్య సాహసాలు సంప్రదాయాలను,
ప్రపంచానికి చాటి చెప్పిన దేశం .
పుణ్య నదులకు జన్మస్థానం నా దేశం,
బంగారం లాంటి పంటలను పండించి,
అన్నదాత గా, అన్నపూర్ణ గా,
పేరున్న దేశం నా దేశం
ప్రపంచంలో నే గొప్ప దేశం భారతదేశం
ఫర్జానా
Farzana
(Teacher)
Nalgonda
Telangana
94403 96378
--------------------------------------------------------------------------------------------------------------------------
Call 89852 51271 @ EDITOR Dr. Sabbani Laxminarayana
Call 9849250784 for more details on Book.
-----------------------------------------------------------------------------------------------------


No comments:
Post a Comment