(Bharat Ki Azadi Ka Amruth Mahotsav)
నా దేశం
సంకెళ్ళు త్రెంచుకున్న స్వతంత్ర భారతి
తళతళ మెరిసే త్రివర్ణకేతనమై
ఆకాశంనిండా గర్వంగా ఎగసింది.
స్వావలంభనకోసం వడవడిగా
అడుగులువేస్తూనే ఉంది
కడలిలో కలసిపోయే నదులపరుగుకు
పగ్గాలుబిగించి . . దేహం నిండా
పంటపొలాల పచ్చదనం నింపుకుంది
నాగళ్ళనడక దాటి యంత్రాల ధాటి పెంచుకుంది
చేతిమగ్గాలను చెరిపేసి
మరమగ్గాల వస్త్రాలు కప్పుకుంటోంది
పంచాంగాలతో మీనమేషాలు గణించిన నేల
గణనయంత్ర విజ్ఞానంతో విశ్వాన్ని శాసిస్తోంది
గాలిపటాలు ఎగరేసిన చేతులు . . నేడు . .
ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేరవేస్తున్నాయి
కరోనా కౌగిట్లో ప్రపంచం విలవిలలాడుతుంటే
టీకాను సృష్టించి రక్షణకవచమై నిలిచింది !
పుడమినిండా ఉగ్రవాదం పడగవిప్పుతుంటే
వేదవాఙ్మయశాంతిని ప్రబోధిస్తోంది !
సహనమే శస్త్రంగా సంయమనం చాటుతోంది!
అంకుర సంస్థల మేడినిండియా నినాదాలతో
ఆత్మనిర్భర్ భారత్ గా అవతారం దాల్చుతోంది.!!
శ్రీధర్ కొమ్మోజు
H.No: 16-4-1434
పల్లవి హాస్పిటల్ రోడ్
శివనగర్ ,
వరంగల్ - 506002
చరవాణి: 9989464467
--------------------------------------------------------------------------------------------------------------------------
Call 89852 51271 @ EDITOR Dr. Sabbani Laxminarayana
Call 9849250784 for more details on Book.
-----------------------------------------------------------------------------------------------------


No comments:
Post a Comment