(Bharat Ki Azadi Ka Amruth Mahotsav)
పురుటిగడ్డ
నా దేశం అవతారపురుషులు
జన్మించిన పురుటిగడ్డ
నా దేశం సస్యశ్యామల గీతం
నాదేశం శాంత్యహింసల్ని
ప్రపంచానికి బోధించిన
వసుధైక కుటుంబిని
నా దేశం మలయశీతల
పవనాంచిత పదకోశం
నా దేశం దేవతలే దిగివచ్చి
ఆడుకొనే సుందరప్రదేశం
నా దేశం స్వాతంత్ర్యవికాస
భానూదయ కాంతివలయం
నాదేశం పారతంత్ర్యమదోన్మత్త
వృక్షవిచ్ఛేద కుఠారం
నాదేశ ఔన్నత్యం హిమాలయం
సమతామమతలకు నిలయం
నాదేశం మనిషిని
మనీషిగా మలచే తత్వార్థఖని
నా దేశం— ప్రతిపౌరుడూ
గర్వంగాతలఎత్తుకొనే భారతదేశంమంకుశ్రీను8985990215——————————————————————
హామీపత్రం
పురుటిగడ్డ కవిత నాసొంత రచన. ఇది దేనికీ
అనువాదం కాని అనుసరణ అనుకరణ ఎంత
మాత్రం కాదని ధ్రువీకరిస్తున్నాను
ఇట్లు తమవిధేయుడు
మంకుశ్రీను
కొప్పర్రు —534275
నరసాపురం మండలం
ప.గో.జిల్లా ఆంధ్రప్రదేశ్
సెల్ 8985990215--------------------------------------------------------------------------------------------------------------------------
Call 89852 51271 @ EDITOR Dr. Sabbani Laxminarayana
Call 9849250784 for more details on Book.
-----------------------------------------------------------------------------------------------------


No comments:
Post a Comment