(Bharat Ki Azadi Ka Amruth Mahotsav)
ఓ భారతమా....
ఓ అమృత భారతమా...
నీ గత వైభవమ్ము స్మరింప..
భవిష్యత్తు స్వప్నసౌధం నిర్మింప....
నీ నడత నీ చరిత విశదింప నా తరమా?
విశాల బాహువుల అఖండదేహాపు అమరత్వం
ఖనిజసంపద, సస్యశ్యామల ప్రకృతి రమణీయత్వం
నైతికవిలువలు నిండిన మహాపురుషుల వ్యక్తిత్వం
దుష్టశిక్షణ సాధురక్షణ సుఖశాంతుల పాలనత్వం
స్వాభిమాన స్వతంత్ర్యసాధన సాహసవీర నేతృత్వం
దేశరక్షణ పోరాతరణమున యువకిశోరాల కర్తృత్వం
గతం పునాదిగా............
నిలిచిన నీ సువర్ణ చరిత్ర అక్షరామృత భాండాగారం..!
జాతీయభావన జనులమంత్రమై
నిల్చును భారత అఖండత్వం
గ్రామస్వరాజ్యం ప్రభుతకార్యమై
వెలుగొందును దేశసౌభాగ్యత్వం
సంస్కృతిసభ్యత ధర్మబధ్ధమై
వెల్లివిరియును విశాల భారతీయత్వం
అంతరాలు తొలగి ప్రజలు ఏకమై
నాటుకొనును విశ్వఆర్యత్వం
స్వదేశీ స్వావలంబన ప్రగతిసూత్రమై
సాగిపోవును నవయువకత్వం
విజ్ఞానం సంస్కారం జగతికందించి
సాధించును భారత విశ్వగురుత్వం
భవిష్యత్ లక్ష్యంగా........
భారతనిర్మాణ సౌధం భావితరాల బంగారు యుగమే!!
సామల కిరణ్ జూలపల్లి,
పెద్దపల్లి జిల్లా.99493 94688--------------------------------------------------------------------------------------------------------------------------
Call 89852 51271 @ EDITOR Dr. Sabbani Laxminarayana
Call 9849250784 for more details on Book.
-----------------------------------------------------------------------------------------------------


No comments:
Post a Comment