(Bharat Ki Azadi Ka Amruth Mahotsav)
స్ఫూర్తి కేంద్రం
అమ్మను ఆకలిని గౌరవించిన
భవ్య భారతీయ స్వరూపం
ఆత్మబలంతో సముద్రాలు దాటి
సనాతన ధర్మాన్ని చాటిన మూర్తిమత్వం
సంపదలూ,పదలాలసలూ కాదు
పేదల బాధలను చూసి చలించిన
సమున్నత తత్వం
విద్య విజ్ఞానం కన్నులుగా
మానవత్వమే మహోన్నత లక్ష్యం గా
చికాగో సర్వ మత సభలో
భారతీయ హృదయ కాంతిని
ప్రకటించిన అపూర్వ చేతనత్వం..
సంబోధనలోనే అకుంఠిత దీక్షా కిరణాలను
వెదజల్లిన అపురూప సాధు తత్వం
చరితగతికి ఆత్మబలం కూర్చిన అమృతత్వం..
కాల సంద్రంలో విశ్వాసపు అలయై
యువ శక్తిని తరంగితం చేసిన
చైతన్య స్వరం..
వివేకానంద అవని పై అవతరించిన
నిరంతర స్ఫూర్తి కేంద్రం...
వెల్ముల జయపాల్ రెడ్డివల్లంపట్ల
9441168976--------------------------------------------------------------------------------------------------------------------------
Call 89852 51271 @ EDITOR Dr. Sabbani Laxminarayana
Call 9849250784 for more details on Book.
-----------------------------------------------------------------------------------------------------


No comments:
Post a Comment