(Bharat Ki Azadi Ka Amruth Mahotsav)
అఖండ భారతం..!!
దేశమంటే ఉత్త భౌగోళికమేనా
దేశమంటే మనుషులు కాదా
దానికీ రక్త మాంసాలు, హృదయం ఉండవా
భారద్దేశాన్ని ముద్దుగా ఉపఖండమని పిలుస్తాము
ఇక్కడ భిన్న సంస్కృతులు, భిన్న వేషధారణలు
భిన్న ఆహారపు అలవాట్లు వుంటాయి
ఉత్తరాది తెలుపు, దక్షిణాది నలుపు
అయినా సరే
"సారే జహాసే అచ్చా హిందూస్తాన్ హమారా"
అనే కదా పాడుకుంటాo
ప్రజలంతా ఐకమత్యంగా ఉంటే
పార్టీలకు ఎందుకు నొప్పి
వందేమాతరం అని నినదించాల్సిన నోరు
మందేమాతరం అని ఎందుకు వదురుతుంది
మతసహనం కలిగిన లౌకికత
మైనారిటీలను ఎందుకు దూరం పెడుతుంది
మతవాదం, కుల వివక్ష
దేశాన్ని బలంగా నిలబెట్టగలదా
కలిసి బతుకుదాo
చెట్టాపట్టాలేసుకుని సాగుదాం
అని కాంక్షించే ప్రజలు దేశద్రోహులా
చీలికలు తెచ్చే నాయకులు దేశభక్తులా
ఇదేనా అఖండ భారతం..!!
దేవి యాదగిరి
98660 69151.
చిరునామా:
పోస్ట్: ధర్మారం,(మండలం),
జిల్లా: పెద్దపల్లి,
Pin: 505416.--------------------------------------------------------------------------------------------------------------------------
Call 89852 51271 @ EDITOR Dr. Sabbani Laxminarayana
Call 9849250784 for more details on Book.
-----------------------------------------------------------------------------------------------------


No comments:
Post a Comment