(Bharat Ki Azadi Ka Amruth Mahotsav)
భారతదేశం
భారతదేశం మనదేశం
భారతీయులం మనం మనం
భిన్న కులాలు ఎన్నో ఉన్న
భిన్న మతాలు ఎన్నో ఉన్న
భిన్న సంస్కృతులు ఎన్నో ఉన్న
భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వం
బుద్ధుడు ,గాంధీ పుట్టిన దేశం
పూలే ,అంబేద్కర్ జన్మించిన దేశం
అశోకుడు, అక్బర్ ఏలిన దేశం
ఇందిర, మోదీ పాలించిన దేశం
ఉత్తర దిక్కున హిమాలయం
దక్షిణ దిక్కున హిందు సముద్రం
తూర్పు దిక్కున బంగాళాఖాతం
పడమరదిక్కున అరేబియా సముద్రం
కూచిపూడి, భరతనాట్యం
గుస్సాడి, ఒడస్సి, పేరిణినాట్యం
గంగ,సిందు,గోదావరి,కావేరీ,తపతి నదులు
వ్యాసుడు,వాల్మీకి , పోతన, పంపన కవులు
శుస్రుత,నాగార్జున,ఎల్లాప్రగడ వైద్యులు
ప్రపంచానికి ఆదర్శం మనదే భారతదేశం
డాక్టర్ వాసరవేణి పర్శరాములు, గ్రామం:సింగారం, మం:యెల్లారెడ్డిపేట, జిల్లా:రాజన్న సిరిసిల్ల, 505305,సెల్:9492193437.--------------------------------------------------------------------------------------------------------------------------
Call 89852 51271 @ EDITOR Dr. Sabbani Laxminarayana
Call 9849250784 for more details on Book.
-----------------------------------------------------------------------------------------------------


No comments:
Post a Comment