(Bharat Ki Azadi Ka Amruth Mahotsav)
నా దేశం.... భారతదేశం
ఆత్మీయ పలకరింపు
అనురాగం చిగురించు
సమతా మమతల కోవెల
నా దేశం...భారతదేశం
అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలి
విశ్వానికి విజ్ఞాన జ్యోతైన దేశం
నా దేశం... భారతదేశం
సంస్కృతి సభ్యతలు కాపాడుతూ అబల కాదు సబలయని
మహిళా సాధికారతను
మహోన్నతం చేసిన దేశం
నా దేశం... భారతదేశం
హిందూ ముస్లిం క్రైస్తవ సంస్కృతుల మేళవింపు
భిన్నత్వంలో ఏకత్వం
సమైక్యత, సౌభ్రాతృత్వాన్ని
నింపిన దేశం
నా దేశం.... భారతదేశం
"జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి" యని
మాతృమూర్తి, మాతృభూమి
స్వర్గం కంటే గొప్పవని
వెలుగెత్తి చాటిన దేశం
నా దేశం.... భారతదేశం
--------------------------------------------------------------------------------------------------------------------------
Call 89852 51271 @ EDITOR Dr. Sabbani Laxminarayana
Call 9849250784 for more details on Book.
-----------------------------------------------------------------------------------------------------


No comments:
Post a Comment