(Bharat Ki Azadi Ka Amruth Mahotsav)
భారతీయతే ప్రాణంగా.....
విశాల విశ్వగమనంలో,
ఈ నేలతల్లి వారసత్వం..
ఏ జన్మను తడిమిన పుణ్యమో!!!
ఆత్మీయతల రేకులు విరిసి,
అనుబంధాల తావులది,
మూల మూలలను పలకరించిన
మానవతా ప్రభంజనం ఈ దేశం..
నిదురించిన అమాయకత్వం మాదే..
రొమ్ము విరిచిన పౌరుషం మాదే...
అవహేళన చేసి, హీనంగా చూసే శత్రువైనా,
ఆతిథ్యమిచ్చి, అందలమెక్కించే మిత్రుడైనా
తేడా లేనే లేదు మాకు....
మూఢ నమ్మకాల బలహీనతలైనా,
సంప్రదాయాల వాదాలైనా,
కులవర్గపు పోరులైనా,
మతాల సరిహద్దులున్నా,
ప్రకృతి ప్రకోపించినా,
ఆర్థిక వ్యవస్థ కుదేలైనా,
కలిసే ఉంటాం కలలోనైనా....
దేనికీ తలవంచని నైజం,
ఏదైనా ఎదిరించే సాహసం,
స్వీయగౌరవం మా రక్తం,
ఆత్మవిశ్వాసం మా బలం,
అనువుగా ఉంటే అల్లుకుపోతాం..
తేడాలొస్తే అంతు తేలుస్తాం...
జన్మలెన్నైనా పుడతాం మళ్ళీ మళ్ళీ...
భారతీయతే ప్రాణంగా..!!
-----------
అరుణ ధూళిపాళ8712342323--------------------------------------------------------------------------------------------------------------------------
Call 89852 51271 @ EDITOR Dr. Sabbani Laxminarayana
Call 9849250784 for more details on Book.
-----------------------------------------------------------------------------------------------------


No comments:
Post a Comment