(Bharat Ki Azadi Ka Amruth Mahotsav)
అమ్మా! భారతావని !
ఇల నిన్ను మించిన స్వర్గమేది ?
నాల్గు వేదముల వేదభూమి
త్రివేణి సంగమ పవిత్ర భూమి
భరత వర్షమున పుట్టి
భరత వర్షము మెట్టిన వారి సిరి ఎన్నగ
చెప్పందగునే! ఇట్టి వారసత్వము మాకొసంగ !
కానగా ధన్యతన్ పొందితిమి
పురాణేతిహాసముల పుణ్యభూమి
విభిన్న సంస్కృతుల, వేష-భాషల విశ్వభూమి
హిమశైల శిఖర శైలభూమి
హిమానీ నదీనదాల నాట్యభూమి
ప్రాక్పశ్చిమ, దక్షిణోత్తర సస్యశ్యామల భూమి
అలకల-కులుకుల హొయలొలుకు
శిల్పకళా వైభవ-ప్రాభవ భూమి
ఇది కదా పుణ్యము, ఇది కదా యశంబను
ఘన కీర్తి చాటిన ధన్యభూమి
వసుధైవ కుటుంబమన మాదే!
ఇట జన్మమెత్తిన చాలు, జన్మ ధన్యతగాంచున్.
వంగల నాగవెంకట పద్మావతి
పాఠశాల సహాయకురాలు
బాలికోన్నత పాఠశాల, తిరుమలగిరి
లాల్బాజార్ హైదరాబాద్-౫౦౦౦౧౫
99519 74900
--------------------------------------------------------------------------------------------------------------------------
Call 89852 51271 @ EDITOR Dr. Sabbani Laxminarayana
Call 9849250784 for more details on Book.
-----------------------------------------------------------------------------------------------------


No comments:
Post a Comment