(Bharat Ki Azadi Ka Amruth Mahotsav)
అఖండ భారత్
అఖండ భారత్
దైదీప్య మానంతో
వెలిగిపోతున్నది,
మూడు వందల ఏండ్ల
బ్రిటిష్ తెల్ల దొరల
వలస పాలనకు స్వస్తి జెప్పిన మన అహింసాయుత స్వాతంత్రోద్యమం విశ్వవిఖ్యాతం,
అజాదీ కా అమృత్యోత్సవాల సంరంభ సంబురం ఒక ప్రత్యేక సందర్భమే,
కశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా మన ఘన
ప్రజాస్వామ్య సౌధంలో
పవిత్ర గంగై మన తిరంగా జెండా గగన వీధుల్లో స్వేచ్చా గీతం పాడుతూ విజయోత్సహం తో అజేయమై విహరిస్తోంది,
జాతిపిత మహాత్మాగాంధీ స్వాతంత్య్ర సమరం అజరామరం,
వీర సుభాష్
సైనిక విన్యాసం అజేయం, అమేయం,
130 కోట్ల ప్రజకు
అంబేద్కర్ రాజ్యాంగం నాటి నుండి నేటికి
జనజీవన వేదం,
తొలి ప్రధాని పండిట్ నెహ్రు సు పరిపాలన పరిమళం,జాతిని ఏకతాటిపైకి తెచ్చిన ఉక్కుమనిషి
సర్దార్ వల్లభాయ్ హోమ్ మంత్రా0గం నిత్య స్మరణీయం, కోరలు చాస్తున్న సీమాంతర ఉగ్రవాదం ,
అశాంతి,కుల విద్వేషాలు, మతోన్మాదాలు,
అవినీతి, రాజకీయ స్వార్థాలు, బంధుప్రీతి, హింసావాదాలతో
జాతి సమైక్యతకు తూట్లు పొడవడానికి నిరంతరం
ప్రయత్నిస్తున్న అసాంఘిక శక్తులపై
మూడొకన్ను పనిచేస్తుండాలి, విద్రోహము పై ఉక్కుపాదం మోపాల్సిందే,
ప్రజలే ప్రభుతకు వజ్రకవచాలై
దేశ సమైక్యతకు
నవ సారథులై,
పిడికిళ్ళు బిగించాలి,
కలుపు మొక్కల ఏరివేతపై సమర శంఖం నిరంతరం పూరించాలి,సుదర్శన చక్రం భరత మాత నుదిట అరుణారుణ సింధూరమై శోభించాలి,
స్వచ్ఛ పాలనకు ఓటు
దివ్య ఔషధమై పోవాలి,
ఐదేండ్ల ప్రజాస్వామ్య పరీక్షల్లో దేశభక్తులే తిరుగులేని శక్తులై , విజయులై,
ఆశావహులై రామరాజ్యాన్ని కొనసాగించాలి,
జ్జైజవాన్, జైకిషాన్,
నినాదాల కు పాలకులు ఊపిర్లలందించాలి, పురి విప్పిన నెమల్ల నృత్యాలతో, గండు కోయిలల అనురాగ
రాగాలతో ప్రగతి పథంలో నవ వసంతాలను పండించాలి,
ప్రణాళికా బద్ధ
స్వయం సమృద్ధి,హితోధిక పారిశ్రామిక ప్రగతి,
సరిహద్దుల పరిరక్షణ,
పర్యావరణ పరిరక్షణలకు జాతినేతలు ముక్తకంఠంతో జేజేలు పలకాలి,
సనాతన ధర్మానికి
మంగళాశాసనాలు
పలకాలి,
75 ఏండ్ల ప్రజాస్వామ్య
పరిరక్షణ పర్వముపై పున స్మరణీయం అమృత్యోత్సవమే,
జ్ఞాన తేజంతో
కాంతి పుంజాలై
వసుధైక కుటుంబమై
భారత్ అజాదీ అమృతోత్సవాలు దేశభక్తి ప్రఫుల్లతమై సార్థకం కావాలి,
సంపన్నులు సామాన్యులకు ఆలంబనై నిలవాలి,
ప్రగతి ప్రజాస్వామ్య భూమికపై సారవంతం కావాలి, అమరవీరుల సదాశయాలకు మనమంతా కర్మవీరులై కంకణ బద్ధులై నిలవాలి,
అఖండ సమైక్యతా జ్యోతి వెలుగుల్లో
జాతి చైత్యన్యవంతమై
పురోగతి పథంలో నడవాలి!
సంకేపల్లి నాగేంద్రశర్మ
రచయిత,
ఇంటి నంబర్:
6-6-1031/1,
శివాజీ నగర్,
కరీంనగర్-505001,
8074826371.
--------------------------------------------------------------------------------------------------------------------------
Call 89852 51271 @ EDITOR Dr. Sabbani Laxminarayana
Call 9849250784 for more details on Book.
-----------------------------------------------------------------------------------------------------


No comments:
Post a Comment