(Bharat Ki Azadi Ka Amruth Mahotsav)
మేరా భారత్ మహాన్
నా దేశ కీర్తి ఆసేతుహిమాచలం నా దేశ భక్తి అనిర్వచనీయం,అచంచలం నా దేశ సంప్రదాయం ఉప్పొంగే గంగ నా దేశ సంస్కృతి ఉత్తుంగ తరంగ భిన్నత్వం లో ఏకత్వం సర్వ మత సమానత్వం జాగృత పరిచే జాతీయత భాసించే నా భారతీయత రామకృష్ణ,వివేకానందులు నడయాడిన పుణ్యభూమి పృథ్వీరాజ్, ప్రతాప్, శివాజీలు ఏలిన కర్మభూమి రాణీరుద్రమ, ఝాన్సీ లక్ష్మి, రజియా ల త్యాగఫలం అల్లూరి, భగత్ సింగ్, ఆజాద్ ల పోరాటఫలం నా దేశం ఉపనిషత్తుల గని నా దేశం సనాతనశాస్త్రాల ఖని నా దేశం ధర్మసూక్ష్మాల వని నా దేశం వేద, వేదాంగాల అవని నేతాజీ,నౌరోజీ,గాంధీజీ ల నాయకత్వం లాల్, బాల్, పాల్ త్రయం వారసత్వం ప్రపంచపు అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత గొప్ప ప్రజాస్వామ్యం భిన్న జాతుల, భాషల, సంస్కృతుల సమాహారం విభిన్న వనరుల, పర్వతాల, నదుల మణిహారం మరెక్కడా లేదు ఇంత మంచి 'జహాన్' అందుకే అంటాను.... మేరా భారత్ మహాన్! మేరా భారత్ మహాన్ !
సయ్యద్ ఖాసీం అలీ
ప్రిన్సిపల్90590 22889--------------------------------------------------------------------------------------------------------------------------
Call 89852 51271 @ EDITOR Dr. Sabbani Laxminarayana
Call 9849250784 for more details on Book.
-----------------------------------------------------------------------------------------------------


No comments:
Post a Comment