Geeta Prakashan Bookswala's Anthology "Operation Sindhur" in Editorialship of "Dr. Sabbani Laxminarayana")
నాడు అదొక హిమశిఖర ప్రాంత తీరం!
అందాలొలికే మానస సరోవరం!
ప్రశాంతత కొలువైన ప్రాకృతిక ప్రదేశం!
ప్రకృతిలో సరికొత్త సోయగాలకు ప్రతిరూపం!
నేడు ప్రకంపనల సృష్టికి మూల స్తంభం!
అలజడులతో అట్టుడికిన కేంద్రo!
పరమత సహనo కోల్పోయిన
హిందూ మహిళల నుదుటి సింధూరాన్ని చెరిపేసిన
నేడు రక్తసింధూరం రణక్షేత్రం!
భారత ప్రభుత్వ సాహసోపేత దిశా నిర్దేశనంతో..
దీటైన, ఘాటైన సమాధానం!
ఆపరేషన్ సింధూర్ పర్యవసానo!
తీవ్ర ఉత్కంఠతకూ ఓ చరమాoకo!
ఉగ్రవాదుల ఉన్మాదంతో జ్వలించిన
భీకర దుశ్చర్యలను నడుమ ఓ..దుఃఖసాగరం!
పోరుకు ప్రతీకార చర్యగా
మొక్కవోని దీక్షా కంకణంతో
ఉన్మాదులను దునుమాడిన
భారత సైన్యo సాహసోపేత నిర్ణయం!
ఇది భారత జాతి జయకేతనం!
దొంగమాటు దుశ్చర్యలకు
ధీటుగా
తనదైన ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకొని
గుండె నిబ్బరాన్ని నింపుకొని
దేశం కోసం పౌరుషాగ్ని రగిలించిన
నొసటిపై సింధూరాన్ని దిద్దిన
శత్రు రాజ్యానికి సవాల్ విసిరిన
నవ చరిత్ర లిఖించిన
వీరసైనికులకు వందనం!
వీర జవానులకు అభివందనం!!
💐💐💐💐💐💐
© పరాoకుశo రఘు నారాయణ
99497 49987
----------------------------------------------------------
------------------------------------------------------------------------------
GEETA PRAKASHAN
Please call us 62818 22363
No comments:
Post a Comment