(Geeta Prakashan Bookswala's Anthology "Operation Sindhur" in Editorialship of "Dr. Sabbani Laxminarayana")
చెరిగిన మన ఆడపడుచుల నుదుటి సింధూరం లోంచి
నేలను తడిపిన పర్యాటకుల నెత్తుటి చుక్కల్లోంచి
ఉద్భవించిన బ్రహ్మాస్త్రమే ఆపరేషన్ సింధూర్
స్త్రీల కన్నీటికి కారణమైతే కాటికి చేర్చే చరిత్ర మనది
అందుకే
మన దేశ స్త్రీల కంట నీరు తెప్పించిన
ఉగ్రవాదులపై
గగనానికేగిన మన వీర వనితలు ఉగ్రరూపం దాల్చితే
పరారైపోయిందిగా
పాకిస్థాన్ ఉగ్ర దళం ఉరుకుల పరుగులతో
చావుకు ఎదురెళ్లి మన దేశసైనికులు
ఉగ్ర స్థావరాలపై ఉక్కు పిడికిలి బిగించితే
ఊపిరి ఆగిపోయిందిగా పాపపు పాకిస్తాన్ కి
మన వీర జవానుల శౌర్యం చూసి
రెపరెపలాడే మూడు రంగుల జెండా
విజయ గర్వంతో .
భారత్ జోలికి వస్తే బ్రతుకు పైన ఆశుండదని
తెలిసివచ్చిందిగా దేశవిదేశాలకి
ప్రపంచమంతా ప్రశంసల వర్షం కురిపించిందిగా మన సైనికదళానికి
మన సైనిక బలగాన్ని
మన దేశ బలాన్ని
నిరూపించిందిగా
ఆపరేషన్ సింధూర్
మన ఆడపడుచుల కన్నీటికి పరిణామమే
ఈ ఆపరేషన్ సింధూర్
మన భరతమాత విజయానికి ప్రతీక
ఈ ఆపరేషన్ సింధూర్
ఈ ఆపరేషన్ దెబ్బకి
పాకిస్థాన్ అయ్యిందిగా పరేషాన్
ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయింది ప్రాణభయంతో.
💐💐💐💐💐💐
© ఏముల అంజలి
7989022455
----------------------------------------------------------
------------------------------------------------------------------------------
GEETA PRAKASHAN
Please call us 62818 22363
No comments:
Post a Comment