Geeta Prakashan Bookswala's Anthology "Operation Sindhur" in Editorialship of "Dr. Sabbani Laxminarayana")
పహల్గామ్ దుర్ఘటనలతో
ముతైదువుల నుదుటనున్న సింధూర తిలకాన్ని చేరిపింది
ప్రకృతి సౌందర్యాధుకులను
హతమార్చింది పాకిస్తాన్!
ఉగ్రవాదాన్ని ఉరిమింప చేసి
మతోన్మాదాన్ని మెరిపింప చేసింది
అమాయక జనులపై తుపాకీలను ఎక్కుపెట్టి
కిరాతకంగా చంపారు దాయాదులు!
అన్ని వైషమ్యాలను మరచి
ఐక్యమై పోరాడుతున్నారు భారతీయ పౌరులు
ప్రాణాలను ఎదురోడ్డి విరోచిత పోరాటం కొనసాగిస్తున్నారు భారతీయ జవానులు.
ఆపరేషన్ సింధూరంతో
తీవ్రవాదులు తోకముడవం ఖాయం!!!
శాంతి, సామరస్యాలు భారతీయుల అభిమతమైనప్పటికి...
మతోన్మాదులకు బుద్ది చెప్పేందుకు వాటికి విరామమిద్దాం
పాక్ సైన్యానికి షాక్లిస్తూ,
దాడికి ప్రతి దాడి చేస్తూ
భారతీయుల శక్తియుక్తులను ప్రపంచానికి చాటి చెప్తున్న భారతీయ జవాన్లకు జేజేలు పలుకుదాం
జయహో భారత్ అంటూ నినదిద్దాం!!!
💐💐💐💐💐💐
© డా. ఆళ్ళ నాగేశ్వరరావు
( కమల శ్రీ )
కవి... రచయిత... ఆర్టీసీ కండక్టర్
తెనాలి.. 522201.
చరవాణి :7416638823
----------------------------------------------------------
------------------------------------------------------------------------------
GEETA PRAKASHAN
Please call us 62818 22363
No comments:
Post a Comment