Geeta Prakashan Bookswala's Anthology "Operation Sindhur" in Editorialship of "Dr. Sabbani Laxminarayana")
సీ.
మతము పేరిట మాదు మాతృభూమిని రెండు
ముక్కలు చేసిన మూర్ఖ వీవు!
వదలిన దానికి, అదనంపు భూమిని
అత్యాశగా కోరు స్వార్థి వీవు!
మతమన్న మత్తులో మా భూమిపై తీవ్ర వాదమ్మునే రేపు పాపి వీవు!
మా దేశ వృద్ధిని మనమునం దోర్వక
కీడు నొనర్చు నికృష్ట వీవు!
తే.గీ.
నాల్గు మార్లు మున్ యుద్ధాలు నడిపి, తుదకు -
చిత్తు చిత్తైన నీకింక సిగ్గు లేదు!
ఓసి దుష్ట పాకిస్తాను! హుంకరించ -
వంచి, పాతాళమున నిన్ను పాతగలము!
ఆ.వె.
పహలుగాము నందు బాటసారుల పైన
కాల్పులు జరిపించి కర్కశముగ -
మతము పేర నైతి మాయని చిచ్చువు!
మానవత్వమునకు మచ్చ నీవు!
ఉ.
ఊరక యుందుమే? తిరిగి యొక్కటె దెబ్బను కొట్టినంత నీ
ఊరులు, పట్టణాల్ చితికి, ఉన్న స్థిరాస్తులు నాశమయ్యెగా!
వేరొక దారి లేక, ఇక విత్తము నప్పుగ కోరుకొంచునున్ -
యూర, పమేరికా విభుల కూడిగమున్ సలుపంగ బోయితో!
కం.
ప్రక్కన బల్లెము వలె నీ
వెక్కువ జేసితివొ - ఇంక నేకుకు మేకై
ఉక్కిరి బిక్కిరి జేసెద;
మిక్కడితో నీ కుచేష్ట లెవి చెల్లవులే!
కం.
ధర్మము మా భారత భువి
కర్మము! మంచికిని మంచి; కన - చెడుకు చెడే!
మర్మము నెరుగక సాగెడు
దుర్మతులను తుట్టతుదకు దునిమెద, మంతే! #
💐💐💐💐💐💐
© డా. ఆచార్య ఫణీంద్ర
99598 82963
----------------------------------------------------------
------------------------------------------------------------------------------
GEETA PRAKASHAN
Please call us 62818 22363

.jpeg)
No comments:
Post a Comment