Geeta Prakashan Bookswala's Anthology "Operation Sindhur" in Editorialship of "Dr. Sabbani Laxminarayana")
కాలం వెనక కాలి పరుగులు తీస్తూ కవ్విస్తూ
కర్కశమై ఈ దేశ పటాన్ని కాటేస్తున్న వైనం!
తెగించి తెగనరికి పారేస్తున్న పొంచి ఉన్నముప్పులు…
ఇప్పుడు అనివార్యత తానుగా ఎలుగెత్తిన వాస్తవం!!!
చావడాలు, చంపి పారేయడాలు అక్కడ నిరంతర మవుతూంటే,
ప్రవర్థమాన మవాల్సిన మనిషి జాడ
మతోన్మాదాన మనిషి జీవికను ప్రశ్నార్ధకం చేస్తూ ఉంది!
పరాయిదేశాల దురహంకారాలు, దుర్నీతులు, దురాగతాలు...
ఎరుపెక్కిన ఎజెండా విధ్వంస రచనకు శ్రీకారమయితే.
అనివార్యమై ఎలుగెత్తిన 'ఆపరేషన్ సింధూర్!''
కిరాతకుల నయవంచనలు, అమాయకుల దుర్మరణాలు సింధూర్'
అనేది ఇప్పుడు భరత పటము నుదుట సింధూరంగా...
ప్రతిదాడిని ‘సామాజిక అనివార్యత’గా నిలుపుతుంది.
కవ్వింపులు, కాలు దువ్వడాలు యుద్ధ మేఘాలకు శ్రీకారం చుడుతుంటే తాత్విక సృజన మాటు భారతీయత
పరాయీకరణను ప్రశ్నించి పారద్రోలుతూనే ఉంటుంది !
ఒకే గాలి ... ఒకే నీరు! ఒకటే ఆకాశం...ఒక్కటే ప్రపంచం!!
శాంతి సూత్రాన్ని ఆలపించని మనిషి జాడ
అమానవీయతతో "విద్వంస రచన 'చేస్తుంటే
'సింధూర్ ఆపరేషన్" పరమార్థానికి ప్రతీకగా ఎలుగెత్తుతూ,
ముస్కర నైజాలను మట్టుబెట్ట బూనుతూనే ఉంది!
💐💐💐💐💐💐
© వడలి రాధాకృష్ణ
చీరాల.
99853 36444
----------------------------------------------------------
------------------------------------------------------------------------------
GEETA PRAKASHAN
Please call us 62818 22363
No comments:
Post a Comment