Geeta Prakashan Bookswala's Anthology "Operation Sindhur" in Editorialship of "Dr. Sabbani Laxminarayana")
ఘనత గల సైనికా వందనం
జయహో జయహో
భరతమాత జనకా
జైత్రయాత్ర సైనికా వందనం
అదిగదిగో అదిగదిగో శత్రు మూకలు
శునక గతిన దారితప్పి దండిగాస్తూ
అధర్మపు దారిలో కాపుగాస్తూ
అదనుచూస్తూ విశ్వ వేదికన
అబాసుపాలు చేయ
కన్నుగప్పిన అహంకారాన
అహంభావపు సూత్రాన
దూర్తకాంక్షన ఆ కౌరవ సేనలు
కలిసి కరుణెరుగని
రీతి రివాజేలేని పద్దతిలో
సామ్రాజ్యకాంక్షన
స్వార్థ చింతనా పరులైన
ఆ దాయాదులు విషపు కూటమినేకమై
తలచి వలచి చుట్టుచేరిరి
ఆభాగ్యలను అమాకులను
మట్టు బెట్టగ దుష్టబుద్దిన
యుద్ధానికి కాలుదువ్వుతు
పాపపు పద్మవ్యూహం పన్నితే...
అరివీర భయంకరులై
అర్జునులై గర్జిస్తూ సకలవిధ ధళాలు
ఏకమై ఎత్తిన గాండీవం దించక
ఎత్తుడెత్తుడే ఎత్తి పడేసింది
కుటిల పన్నగాలన్ని పటాపంచలు చేస్తూ
పోటికి పోటిగా ధీటుగా జవాబునిస్తూ
శత్రువును గురిచూసి కొట్టింది
గుండెల్ని గుట్టుగ చేదించింది
నోరెత్తని రీతీలో సుతిమెత్తగ
సుత్తితో మోదింది ముఖంలో
ఏ రక్తపు చుక్క కానరాకుండా
దిమ్మదిరిగే దెబ్బలతో తలబొప్పి కట్టిస్తే
అదిగదిగో దాయాది కుక్కలు
నీతి ఎరుగని ఆ ఉగ్రవాదిజాతి జనులు
నొప్పితో నోరెళ్లబెట్టి శాంతిని కోరుతు
కాళ్లబేరానికి వచ్చిండ్రూ.
ఈ భ్రహ్మోస్ దెబ్బ ఇంకెందరికో
కర్రుకాల్చి వాతబెట్టినట్లు
చెప్పకనే చెప్పింది
కాచుకోండి పాకిస్తాన్ గుంటనక్కలార
తస్మాత్ జాగ్రత్త.. భారతీయ భ్రహ్మోస్
ఆకాశ్ ... సుదర్శనచక్ర.. నాగ్,
అగ్ని క్షిపణుల పొదిలి మాది
పొందికగా కూర్చోండి లేదంటే పేల్చేస్తం
తూట్లు తూట్లుగ కాల్చేస్తం కమిరిస్తం...
కనబడటం లేదా ఇదో శాంతి కాముక
మహా భరత ఖండం
బలె బలే భ్రమ్మోస్ జయహో
జయహో జేత్రయాత్ర జనక
మహా ఘనత గల సైనికా వందనం
💐💐💐💐💐💐
© యుగంధర్ జనగాని
99486 12284
----------------------------------------------------------
------------------------------------------------------------------------------
GEETA PRAKASHAN
Please call us 62818 22363
No comments:
Post a Comment