(Geeta Prakashan Bookswala's Anthology "Operation Sindhur" in Editorialship of "Dr. Sabbani Laxminarayana")
ఓ మత ఉగ్రవాదులారా! ఓ మూఢులారా!
బాంబులు పేల్చి భయం కలిగించినా
ప్రేమను మాత్రం నాశనం చేయలేరు
తుపాకులతో కాల్చి హీరోలేమి కాలేరు
వీరం అంటే హింస కాదు, సహనం, శాంతి
మతపిచ్చితో సాధించేది ఏమీలేదు
మనిషి మతపిచ్చిని వదిలి పెట్టాలి
ఏ మతం మనిషిని చంపుమని చెప్పదు
శాంతి, సహనం ప్రేమనే కావాలి
మానవత్వంతో ముందుకు నడువాలి
ఈ భూమి మీదకువచ్చిన అందరం బంధువులం
ఇక్కడి గాలే అందరం పీల్చుకుంటున్నాం
ఇక్కడి నీళ్ళే అందరం తాగుతున్నాం
ఇక్కడి సూర్య,చంద్ర వెలుగుల్లోనే అందరం ఉన్నాం
ఈ భూమిపై శాంతి తోటలో ఆనందంతో విహరించుదాం
మతం పేరుతో మనుషులను చంపుకోవడం ఏమిటి
అడవిలో జంతువులు కూడా న్యాయం పాటిస్తున్నాయి
మనుషులైన మనం కౄరమృగాల్లా మారడమేమి
నమ్మకాలు వేరైనా గమ్యం ఒక్కటే కదా
పద్దతులు వేరైనా పరమాత్మ ఒక్కడే కదా
ప్రపంచంలో మతం, కులం, జాతిపేరుతో హింస వద్దు
చిన్న పిల్లల చిరునవ్వుల్లా అందరం కలిసి మెలుగుదాం
రక్తపాతం సృష్టించుకుంటూ పోతే ఎవరం మిగలం
అన్యాయం చేస్తే అంతం అవడం కాయం
శాంతియుత మానవత సమాజమే అందరికీ ఆవశ్యకం
💐💐💐💐💐💐
© డా. వాసరవేణి పర్శరాములు
సింగారం, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ, భారత్
94921 93437
----------------------------------------------------------
------------------------------------------------------------------------------
GEETA PRAKASHAN
Please call us 62818 22363
No comments:
Post a Comment