(Geeta Prakashan Bookswala's Anthology "Operation Sindhur" in Editorialship of "Dr. Sabbani Laxminarayana")
వనితల నుదుటన ధరించిన సిందూరం...
ఉగ్రవాద దాడితో అయింది దూరం...
అందింది మోదీకి దుర్ఘటన సమాచారం...
రూపుదాల్చింది ఆపరేషన్ సిందూర్...
అది రౌద్రరూప ఆంజనేయ అవతార్...
గగనాన ఎగిరిన అతివలు...
గురిచూసి కూల్చారు శత్రుస్థావరాలు...
మేకపోతు గాంభీర్యంతో దాయాదులు చేసిన దాడి...
సుదర్శనచక్రంతో కుదేలైంది చతికిలపడి...
చేతకానితనంతో పౌరులపై జరిపిన కాల్పులకి...
త్రిదళ శౌర్యప్రతాపాలిచ్చిన సమాధానాలకి...
బీరాలు పలికిన గొంతులు జీరలు పోయాయి...
పాహిమాం అంటూ కాళ్ళబేరానికొచ్చాయి
సరిహద్దుల్లో కవ్వింపులని తాటాకు చప్పుళ్ళని సహించారు...
రెచ్చగొట్టే పోకడలని పిల్లచేష్టలని వదిలేసారు...
సిందూరం జోలికొస్తే, జోలె పట్టేలా చేసారు...
ఉగ్రవాదుల ఊపిరిని ఆపేసారు...
ఉన్మాదుల సమస్యని ఊడ్చేసారు...
భారతసైనిక సింహగర్జనకే కలిగింది
భయం...
పంజా విసిరితే పాకిస్థాన్ ప్రపంచపటంలో మాయం...!!
💐💐💐💐💐💐
© సొతుకు రత్నజానకి
S Ratna Janaki
మంచిర్యాల
9177796265
----------------------------------------------------------
------------------------------------------------------------------------------
GEETA PRAKASHAN
Please call us 62818 22363
No comments:
Post a Comment