(Geeta Prakashan Bookswala's Anthology "Operation Sindhur" in Editorialship of "Dr. Sabbani Laxminarayana")
కమనీయం కడు రమనీయం
మన కాశ్మీరం అందం అని
ఆనందంతో చిందులు వేసిన
ఆలుమగలను పిల్లాపాపలను
అదను చూసి హతమార్చిన
హంతకులను అంతమొందించుటకు
సిరిసంపదల కన్నా విలువైన
సింధూరం దూరం చేసిన దుర్మార్గులను
Operation Sindoor అని
అంతం చేసిన జవానులకు సలాం!
పహల్గాములో ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను ఉరితీస్తే తప్పేంటి?
పాకిస్తాన్ ను పతనం చేస్తే తప్పేంటి?
సైనికులారా సలాం
మీ సేవలకు గులాం
దేశం కోసం దేహాన్ని కోల్పోయారు
త్యాగాలు చేశారు తనువు నే చాలించారు.
దేశ రక్షణ కోసం తక్షణమే పోయారు
దేశద్రోహులకు భక్షకులుగా మారారు.
మరువలేము మీ త్యాగాలను
మరిచిపోము మీ
రూపాలను
తెలుగింటి ముద్దుబిడ్డ
మురళి నాయక్
త్యాగాన్ని వెలకట్టలేము
త్రికరణ శుద్ధిగా కరములు జోడించి వందనములు సమర్పించడం తపాఎ!
ఏమిచ్చి తీర్చుకోగలం మీ రుణం.
మీ ఆత్మకు శాంతి
మీ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని దేవుడిని కోరుతూ
అందరి తరపున
మీకు వందనములు
" జై జవాన్"
సైనికులారా
సలాం మీకు.
💐💐💐💐💐💐
© జయశ్రీ బాదాం
Jayashree Badam
హనుమకొండ
9110372552
----------------------------------------------------------
------------------------------------------------------------------------------
GEETA PRAKASHAN
Please call us 62818 22363
No comments:
Post a Comment