(Geeta Prakashan Bookswala's Anthology "Operation Sindhur" in Editorialship of "Dr. Sabbani Laxminarayana")
పచ్చనైన ప్రకృతి శోభతో కనువిందు చేసే కాక్ష్మీరంలో ఉగ్రవాదం ఉగ్రరూపం దాల్చుతున్నది
పట్టపగలే కారు మబ్బు కమ్ముకున్నది లేవవోయి
భారత వీరుడా! ఓ సైనికుడా!
అన్నెం పున్నెం ఎరుగని అమాయకుల
బలి తీసుకుంటున్నది ఆయుధం పట్టి శత్రువుల పీకలు తెగ కోయవోయి ఓ శూరుడా!
భరత మాత కంఠాభరణమైన ఆ దివ్యమైన ప్రదేశంలో మృత్యు ఘోషలు వినబడుతున్నాయి
అస్త్రశస్త్రాలు పట్టి అణచివేయి
ఓ ధర్మ యోధుడా!
మన దేశపు స్త్రీలను పసుపు కుంకుమలకు దూరం చేస్తున్నాయి దుష్ట మూకలు.. ఆయుధం పట్టి ఎదిరించి ముందు నిల్చి ధైర్యమీయవోయి ఓ కర్మవీరుడా!
నీ ప్రాణాన్ని ఫణంగా పెట్టి మా ప్రాణాలు కాపాడుతున్న
నీకు అండగా మేముంటాం!
నీ వీరోచిత పోరాటాన్ని ఎప్పుడూ మరిచిపోము!
నీవెంట మేముంటామని ఇదే మనఃపూర్వకంగా శపథం
మేం చేస్తున్నాము!
నీవున్నావనే ధైర్యంతోనే మేమిక్కడ హాయిగా బ్రతుకుతున్నాము!
విజయమో! వీరవస్వర్గమో! ఏదైతేనేం..దేశరక్షణే ధ్యేయంగా సాగిపో మునుముందుకు!
ఓ సిపాయీ! నీవే మాకు ధైర్యమోయీ!!
💐💐💐💐💐💐
© జోషి మధుసూదన శర్మ
Joshi Madhusudana Sharma
తెలుగు ఉపాధ్యాయులు
ఊరు: కోయిలకొండ
జిల్లా: మహబూబ్ నగర్
9490660155
----------------------------------------------------------
------------------------------------------------------------------------------
GEETA PRAKASHAN
Please call us 62818 22363
No comments:
Post a Comment