Geeta Prakashan Bookswala's Anthology "Operation Sindhur" in Editorialship of "Dr. Sabbani Laxminarayana")
పచ్చని కొండల మధ్య లోయలలో
భూతల స్వర్గమైన మంచుకొండల్లో
నరమేధం మతోన్మాద ముష్కర సైన్యం
విచక్షణ లేని అమానుష పైశాచిక క్రీడతో...
పచ్చని బైయలంతా రుధిర ధారలతో
ఏర్లు పారుతూ అమాయక ప్రజలను
సైనిక దళాల వేషాల్లో బలిదానం తీసుకున్న
ఉగ్రవాదుల కిరాతక ఆనందం దేనికోసం....
దేశమంతా రోదిస్తూ గుండెల్లో గుచ్చిన
గునపం దిగినంత విషాదం ఒంపుకున్నదై
రగులుతూ ప్రతీకార చర్యలకై ఉడుకుతూ
రెచ్చిపోయిన ప్రజలకు ఆపరేషన్ సిందూర్..
ప్రతిఘటించకపోతే మతోన్మాదంతో మరో
విపత్తుకు సిద్ధమయ్యే కీచక మదోన్మాదుల్ని
మట్టుపెట్టడం హర్షణీయ యుద్ధవిజయం
మదిలో పన్నీటి జల్లు కురిసే జాతరలే...
శాంతికాముక దేశ సంస్కృతి పూదోట
భారతాన్ని విచ్ఛిన్నం చేయాలన్న దురుద్దేశం
శత్రువు గుండెల్లో గుండు పేలింది కర్కశమై
ఉగ్రవాదాన్ని మట్టుబెట్టే పోరాటమై సాగే...
మతం కన్నా మానవత్వం గొప్పదన్న
దేశ సంప్రదాయ సంస్కార ఔన్నత్యాన్ని
కాలరాచే ఉగ్రవాదుల భరతం పట్టేందుకు
అప్రమత్తమై ఉక్కు పిడికిలి బిగించాల్సిందే!!
💐💐💐💐💐💐
© వెంకటేశ్వర్లు లింగుట్ల
తిరుపతి
9440472254
----------------------------------------------------------
------------------------------------------------------------------------------
GEETA PRAKASHAN
Please call us 62818 22363
No comments:
Post a Comment