Geeta Prakashan Bookswala's Anthology "Operation Sindhur" in Editorialship of "Dr. Sabbani Laxminarayana")
పహల్గాం ప్రకృతిని ఆస్వాదిస్తూ, సంతసాలలో మునిగితేలుతున్న
ఆడపడుచుల సింధూరం చెరిపేసిన
ముష్కరులను మట్టుపెట్టి,
భరతమాత కంటతడిని తుడిచిన
రణధీరులకు వందనం అభివందనం
ఉన్మాదులకు ఊతమై
తలకెక్కిన మతోన్మాదంతో
అమాయకుల ప్రాణాలను బలిగొన్న
ఉగ్రమూకలకు తగిన బుద్ధి చెప్పిన
వీర జవానులకు వందనం అభివందనం
మాట తప్పి, మడమతిప్పిన
పాకిస్తాన్ కుళ్ళు కుతంత్రాలకు
ఆపరేషన్ సింధూర్ తో
బుద్ధి చెప్పిన వీర వనితల శక్తియుక్తులకు
వందనం అభివందనం
జీవితం బుద్భుద ప్రాయం
శాంతి లేని ఆనందం
ఎండమావి వంటిదే కదా!
కోపాలు, తాపాలు, క్షణికావేశాలను
పక్కన పెట్టి
కుల ,మత, కుత్సితాలను వదిలి
వన్నె, చిన్నెల వర్తమానంలో బతుకుతూ....
స్వార్థం లేని ప్రకృతిలా
సహనం,శాంతి ఆయుధమైన
భారతదేశంతో పెట్టుకుంటే
తప్పని గురితో మారణహోమాలను
మట్టుపెడతామంటు
ఉగ్రమూకల పెంచి,పోషించే
పాకిస్తాన్ కు తగిన గుణపాఠమందించిన
త్రివిధ దళ జవానులందరికి
వందనం పాదాభివందనం
© డా. బండారి సుజాత
హనుమకొండ
9959771228
----------------------------------------------------------
------------------------------------------------------------------------------
GEETA PRAKASHAN
Please call us 62818 22363
No comments:
Post a Comment