(Geeta Prakashan Bookswala's Anthology "Operation Sindhur" in Editorialship of "Dr. Sabbani Laxminarayana")
పల్లవి
ఏ చరితరాయని సాక్ష్యం
ఏ జాతీచూడని కౄరం..
ఎవరి కోసమీ మానవవేట..ఆఆఆ
ఏనాటిదీ అనాగరిక పాటా..ఆఆఆ
ఏనాటిదీ అనాగరిక పాటా...
చరణం 1
ఉరి కొయ్యల ముద్దాడిన వీరత్యాగాల ఫలమేది?
ఊరి మధ్యన వేలాడిన దేశయోధుల విలువేది?
కంటికి కానని దైవంపేరిటా.. సాగుతున్నదీ అమానుషం....
రాక్షస మూకల స్వైర విహారం ....
రాబందుపీడలఘోరపాతుకం ..
ఘోరపాతుకం.
చరణం 2
మానవత్వమే మట్టిలో కలిసి..
మతవిద్వేషం నెత్తికెక్కినా?
మూర్ఖ రక్కసుల తూటాల బారిన....
నిండు బతుకులే ముక్కలాయనా?
మతోన్మాదుల పైశాచిక నృత్యం.
మంటగలిసిన మగువల భావి జీవితం..
దారీ తెన్నూ తెలియని దారిలో..
ధారబోయినవి..నల్లపూసలు..
నల్లపూసలు..
చరణం 3
సుందర భారత సింధూరం
కమనీయ కాశ్మీర వదనం
శాంతి దేవత ప్రసన్న రూపం
కరుణాపూరిత ధృక్కుల భరితం
నిరంతరం జనని శారద స్మరణం..ఆఆఆ
ఆద్యంతం శివోహ జ్వలితం
కాశ్మీర మహిమ తెలియని వేళ..
స్వర్ణ భూమి పై రక్తపుటేరుల ప్రవాహం..
రక్తపుటేరుల ప్రవాహం
💐💐💐💐💐💐
© శ్రీనివాసపురం నాగరాజ పరాంకుశ
Srinivasapuram Nagaraja Parankusa
తిరుపతి
9963460211
----------------------------------------------------------
------------------------------------------------------------------------------
GEETA PRAKASHAN
Please call us 62818 22363
No comments:
Post a Comment