(Geeta Prakashan Bookswala's Anthology "Operation Sindhur" in Editorialship of "Dr. Sabbani Laxminarayana")
దశాబ్దాలుగా దద్ధరిల్లిన హింసాపాతం
ఇప్పుడిప్పుడే దగ్గరపడుతోందని సంతోషించాం
శతాబ్దాలుగా సాగిన సాధారణ పరిస్థితులు
తిరిగి నెలకొంటున్నాయని సంబరపడ్డాం
ఎన్నికలబహిష్కరణకు ఎవరూపిలుపునివ్వలేదని
నిర్భయంగా ఓటేసి మురిసిపోయాం
ప్రజాస్వామిక ప్రభువుల పాలనలో
గండాలు గట్టెక్కాయని కించిత్ గర్వపడ్డాం
నిశ్చల తపములో నిండా మునిగిన చినార్ చెట్లు
స్థానిక పవనాలతో చల్లగా సేదదీరిన గొట్టెగొలుసులు
పరిసరాల్లో పరిమళశోభను సంతరించిన తులిప్పులు
నిరంతరం ప్రశాంతంగా సాగిపోయే సింధూజలాలు!
చచ్చినశవాలు మరిక లేవవని నిర్ధారించుకున్నాయి
పొదలమాటు పొంచిన దాయాది పిశాచగణాలు
ద్విజాతి సిద్ధాంతాన్ని మరలా వల్లెవేయవని
తీర్మానించుకున్నాయి!
మానవత్వాన్ని మరచి సంచరించే తోడేళ్ళు
రక్తదాహంతో రగులుతున్నాయని పసిగట్టలేకపోయాయి!
యుద్ధానికి యుద్ధానికి మధ్య మాత్రమే శాంతి అని
సామాన్యుల ప్రాణాలతో మాకేం సంబంధమని
భీష్మించుకు కూర్చున్న బడాబద్మాష్ గాళ్ళకు!
భరతభూమిపై పురుడు పోసుకున్న ప్రతీ పౌరుడు
పరిణతితో బుద్ధి చెప్పాలి! బలంగా గుద్ది చెప్పాలి!!
💐💐💐💐💐💐
© కరిపె రాజ్ కుమార్
8125144729
----------------------------------------------------------
------------------------------------------------------------------------------
GEETA PRAKASHAN
Please call us 62818 22363
No comments:
Post a Comment