(Geeta Prakashan Bookswala's Anthology "Operation Sindhur" in Editorialship of "Dr. Sabbani Laxminarayana")
మన దేశ నారీరత్నాలు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఇరువురూ నారీశక్తికి, ఐక్యతకు నిలువెత్తు నిదర్శనం. అదే ఆపరేషన్ సిందూర్ పద్యరచన: సహజకవి,డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత
సీసం
భవ్య దేశమ్ముకై ప్రాణాల నొడ్డిన
భారత ఆర్మీకి వందనములు
అధిక ప్రతీకారమందు మంచిని జూపి
రిపుల గూల్చినవార్కి ప్రియపు నుతులు
దేశ మహిళల బట్టి తిలకమ్ము జెరిపిన
దుష్టులన్ గూల్చుట దొడ్డతనము
ఇరువురు భారత యింతి రత్నాలకు
భరతజాతి యొసగె వందనములు
తేటగీతి
ఆపరేషను సిందూరు అద్భుతమగు
విజయ ఘట్టమ్ము గా నిల్చు వీరతతికి
మనదు దేశ నారీశక్తి ఘనత యిద్ది
పహలగామ్ అమరులకయి ప్రణతులివియె.
💐💐💐💐💐💐
© సహజకవి, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు,
Dr. Aanala Malleswara Rao
సహజకవి,డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు,
తెనాలి
9347537635
----------------------------------------------------------
------------------------------------------------------------------------------
GEETA PRAKASHAN
Please call us 62818 22363

.jpeg)
No comments:
Post a Comment