(DESH BHAKTI)
ఆనంద కలశం
ఇది కమనీయ కర్మక్షేత్రం
నవనవోదయ ఆనంద కలశం॥2॥
కొత్తనీటి తరగలా గలగలా
స్వేచ్ఛా వాకిలి తలుపుతట్టి
దశాబ్దాల స్వాతంత్ర్యం ఇచ్చి
కాంతి చక్రాలు సాగె
క్రాంతి ఛత్రాలు పట్టె హృదయోల్లాస తరుణాలు పంచి
పచ్చ పచ్చని తోరణాలు కట్టె ॥ఇద కమనీయ ॥
పరాయి పాలనల నిబిడాంధరాకారం పోగొట్టి
ఉషః కాంతుల సింధూర శోభలు తెచ్చె
బహుభద్రతల స్వచ్ఛ గీతాలు పలికించి
రంగురంగుల ఐక్యతారాగాలు వినిపించె ॥ ఇది కమనీయ॥
పచ్చని జీవన సౌందర్యం కోసం
అమృతోత్సవాల వెన్నెల గింజలు పంచె
అచ్చుహల్లుల మిత్రత్వంలా
నేర్పుల ఓనమాలు నేర్పె
స్వర్ణ శిఖరాలనెక్కే వెచ్చని దేశభక్తి కి
మహోజ్వల చరిత్రతో నిలిచె
నా దేశం కమనీయ కర్మక్షేత్రం
నవనవోదయ ఆనంద కలశం
॥ఇది కమనీయ॥

డా॥ కొండపల్లి నీహారిణి
కవయిత్రి, రచయిత్రి, సాహిత్య విమర్శకురాలు, వక్త .
‘మయూఖ‘ అంతర్జాల ద్వైమాసిక సాహిత్య పత్రిక సంపాదకురాలు.
‘తరుణి‘ స్త్రీ ల అంతర్జాల వారపత్రిక సంపాదకురాలు.
కవితా సంపుటులు, కథాసంపుటి, వ్యాస సంపుటాలు, జీవిత చరిత్ర లు, యాత్రా చరిత్ర, పరిశోధన గ్రంథం , సంపాదక పుస్తకాలు వంటి 13 పుస్తకాలను ప్రచురించారు.
ఇరవై సంవత్సరాలు బోధనా రంగంలో ఉద్యోగం చేసారు.
--------------------------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------------------------------------------------------

No comments:
Post a Comment