(Bharat Ki Azadi Ka Amruth Mahotsav)
స్వాతంత్ర్య వజ్రోత్సవంజ్యోతితో జ్ఞాన దీపాన్ని వెలిగిద్దాం
వీరరస పాటను నూతనంగా గానం చేద్దాం
దేశప్రజలందరం కలిసి అమృత మహోత్సవాలను ఘనంగా జరుపుకుందాం
మన ఇంటి ప్రాంగణంలో సువాసన వెదజల్లే మొక్కలు నాటుదాం
దేశం నుండి అజ్ఞానం అనే అంధకారాన్ని తరిమివేద్దాం
స్వేచ్ఛతో సూర్యునిలా స్వయం ప్రకాషిద్దాం
ప్రతి హృదయంలో దేశభక్తి బీజాలు నాటుదాం
భారతదేశంను తులసి కోటవలె అలంకరిద్దాం
దేవలోకము నుండి దేవుడు కూడా భరతభూమిని చూడటానికి వస్తాడు
దేశ మాత కీర్తనలను సిరాతో కాకుండా మనస్సుతో రాద్దాం
వేదాలు మరియు పురాణాల వైభవం తిరిగి తీసుక వద్దాం
అమరవీరుల గాథను తిరిగి గానం చేద్దాం
అలా మాతృభూమి రుణం తీర్చుకుందాం
ఆకాశంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేద్దాం
ఉన్నత హిమాలయాలలాగా దేశ ఆత్మగౌరవాన్ని పెంచుదాం.
భారతీయుల ఐక్యతను ప్రపంచానికి చాటి చెబుదాం
ఈ విశాల భూమిపై శాంతి సందేశాన్ని వ్యాప్తి చేద్దాం
భారతమాతను చూసి స్వర్గం కూడా పులకించి పోయేలా చేద్దాం భారతదేశానికి మళ్లీ బంగారు మెట్లను కడుదాం
అలా భారతదేశంలో వజ్రోత్సవములు జరుపుకుందాం
--------------------------------------------------------------------------------------------------------------------------
Call 89852 51271 @ EDITOR Dr. Sabbani Laxminarayana
Call 9849250784 for more details on Book.
-----------------------------------------------------------------------------------------------------


No comments:
Post a Comment