(Bharat Ki Azadi Ka Amruth Mahotsav)
ఓ సైనికుడా నీకు వందనం
దేశ సరిహద్దుల్లో పహారా కాస్తూ....
సరిహద్దులు దాటే శత్రు సైన్యాన్ని అంతమొందిస్తూ..
ప్రతి క్షణం ఫిరంగుల మోతల్లో జీవిస్తూ...
శత్రు దాడుల్లో ప్రాణాలను త్యాగం చేస్తూ...
రక్తం గడ్డకట్టే చలిలో నిత్యం నడుస్తూ...
చీమ చిటుక్కుమన్న అదమరిచి ఉండకుండా...
ఎన్నో నిద్రలు మానేసి దేశం కోసం సేవలు చేస్తూ...
కన్నవారిని ఉన్న ఊరిని వదిలి కష్టాలను భరిస్తూ...
అలుపెరుగని జీవన పోరాటం చేస్తూ...... దేశ రక్షణ కోసం ప్రాణం ఫణంగా పెడుతూ...
దేశ ప్రజల కోసం, దేశ సేవకుడివి నీవూ...
మా ఉనికిని కాపాడే రక్షకుడివి నీవూ...
నీ సాహసం మహా సంకల్పం....
నీ ధైర్యం ఆసేతు హిమాచలం....
మీరు లేనిదే మేము లేము....
మీరే మా ధైర్యం, మీరే మాకు బలం...
ఓ సైనికుడా నీకు మా వందనం...
అందుకో మా అభివందనం... !
గుండు రమణయ్య
(చిత్రకారుడు, కవి, రచయిత )
గ్రా. పెద్దాపూర్
మం. జూలపల్లి
జిల్లా. పెద్దపల్లి
రాష్ట్రం. తెలంగాణ
సెల్. 9440642809--------------------------------------------------------------------------------------------------------------------------
Call 89852 51271 @ EDITOR Dr. Sabbani Laxminarayana
Call 9849250784 for more details on Book.
-----------------------------------------------------------------------------------------------------


No comments:
Post a Comment