(Bharat Ki Azadi Ka Amruth Mahotsav)
పవిత్ర భారత దేశం
భరత ఖండంబు చక్కని పాడి ఆవు
అన్నాడు చిలకమర్తి
దేశమేగినా ఎందుకాలిడినా
పొగడరా నీజాతి నిండు గౌరవంబు
అన్నాడు రాయప్రోలు
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
అన్నాడు గురజాడ
ఎందరో మహాకవులు తన దేశభక్తిని
గేయరూపంలో వినిపించి
భారత దేశ గౌరవాన్ని కాపాడాలని
ప్రజలను ఉత్తేజ పరిచిన దేశభక్తి కవులెందరో------
పాడి పంటలకు నిలయమైన ది
నాదేశం పవిత్ర భారతదేశం
సంస్కృతి సంప్రదాయాలకు
నిలయమైన నాదేశం
ఝాన్సీ, రుద్రమ ఎందరో నారీమణులకు
వీర నారు లకు జన్మనిచ్చిన ది నాదేశం
నాలుగు వేదములు పుట్టిన దేశం
ఎంతో మంది మహానుభావులకు
జన్మనిచ్చిన పవిత్ర భారతదేశం
ధన్యమైనది ధన్యమైనది
జి శారద
తెలుగు ఉపాధ్యాయురాలు
నల్లగొండ
తెలంగాణ.
9652539170--------------------------------------------------------------------------------------------------------------------------
Call 89852 51271 @ EDITOR Dr. Sabbani Laxminarayana
Call 9849250784 for more details on Book.
-----------------------------------------------------------------------------------------------------


No comments:
Post a Comment