(Bharat Ki Azadi Ka Amruth Mahotsav)
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన మీరు.
అందరూ ఒక్కటై భారతదేశ సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడుతూ.
స్వతంత్ర భారత అమృత్యోత్సవాలను జరుపుకుంటున్న.
త్యాగ ధనులారా మీకు వందనం.
గుండెల నిండా దేశభక్తిని నింపుకొని .
ప్రతి రక్త రక్తనాళంలో నరనరాల్లో భారత దేశ భద్రతను ఇముడ్చుకొని.
దేశ రక్షణ కోసమే జీవిస్తూ.
ప్రాణ త్యాగానికి సిద్ధంగా ఉన్న వీరులారా మీకు వందనం.
ఎముకలు కొరికే చలిలో గుండెలు పగిలే ఎండలో.
ఒళ్లంతా తడిచే వానలో ఎన్నో బాధలు భరిస్తూ.
దేశం కోసం దేహాన్ని పణంగా పెడుతూ.
భరతమాత గర్భంలో తలదాచుకుంటున్న సిపాయులారా మీకు వందనం.
ఊరు వాడకు కన్న వారికి కనిన వారికి దూరంగా భారంగా .
బార్డర్ లోనే ఊరిని చూసుకుంటూ తోటి సైనికుల్లోనే బంధువులను తలుచుకుంటూ.
దేశమంతా మీతోనే ఉన్నదనుకొని .
దేశ ప్రజల ఇంటింటా మువ్వన్నెల జెండా రెపరెపలాడేలా చేస్తున్న దేశభక్తులారా మీకు వందనం.
మట్టి రంగులో ఆకు పచ్చని వర్ణంలోనే అన్ని రంగులను విలీనం చేసుకొని.
భరత మాత బహూకరించిన సైనిక దుస్తుల్లోనే అన్ని దుస్తులను చూసుకుంటూ.
భారత్ మాతాకీ జై అంటూ.
వెన్ను చూపకుండా అడుగులు వేసే దేశభక్తులార మీకు వందనం.
అభివందనం
కవి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, మంచిర్యాల.
చరవాణి: 98 49 25 47 47
--------------------------------------------------------------------------------------------------------------------------


No comments:
Post a Comment