(Bharat Ki Azadi Ka Amruth Mahotsav)
నా దేశం ఒడి నేర్పిన పాఠాలన్నీ
శ్రద్ధాసక్తుల నేర్చిన బడిలో
మొదటి విద్యార్థిలా దేశీయులంతా
ఒక్కటై మిక్కిలై ఎద మైదానం లో
హక్కుల బాధ్యతల విత్తులు విత్తే సందర్భం
ఇప్పుడు అనుభవాల విజ్ఞత గా తొంగి చూస్తున్నది
నా దేశం
అమృతోత్సవ స్వేచ్ఛ భారతిని గుండె భూమికపై కొద్దికొద్దిగా అద్దుకొని హద్దుకొని
స్వచ్ఛ భావన ముందు ప్రణమిల్లి
మనదైన సంస్కృతి
తనదైన మట్టి పరిమళం
మరెన్నో దేశాల కు ఆదర్శమవుతున్న అద్భుతాన్ని
మనోవేదికపై సేదదీర్చాలి
నాదేశం
జ్ఞాన జ్యోతుల
తత్వ శాస్త్ర సమ్మిళితం
సమరసతా సమన్వయ భావతాళాల
రాగాన్నెత్తి కోటిగొంతుకల నినదిస్తున్నది
నా దేశం వివేకవాణి
డా॥ కొండపల్లి నీహారిణి
98663 60082
కవయిత్రి,రచయిత్రి ,సాహిత్య విమర్శకురాలు, వక్త .‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక సాహిత్య పత్రిక సంపాదకురాలు.‘తరుణి‘ స్త్రీ ల అంతర్జాల వారపత్రిక సంపాదకురాలు.
కవితా సంపుటులు, కథాసంపుటి,వ్యాస సంపుటాలు,జీవిత చరిత్ర లు, యాత్రా చరిత్ర, పరిశోధన గ్రంథం , సంపాదక పుస్తకాలు వంటి 13 పుస్తకాలను ప్రచురించారు. ఇరవై సంవత్సరాలు బోధనా రంగంలో ఉద్యోగం చేసారు.
--------------------------------------------------------------------------------------------------------------------------


No comments:
Post a Comment