(Bharat Ki Azadi Ka Amruth Mahotsav)
వజ్రభారతి
-------------------------
స్వాతంత్ర్య సమరోత్సవగీతం వినిపించాలి
నా దేశం గుండె నోట
తెగిన భారతమాత శృంఖలాలు
నాటి త్యాగ ప్రజానిరతికి విజయ సంకేతాలు
చేత కర్రపట్టిన గాంధీ ఊరూరా నడిపిన అహింసావాదం
ఒక వేదం
విల్లమ్ములు పట్టిన అల్లూరి
మన్య జీవుల బతుకుల్లో ప్రవేశించిన
విప్లవ బీజాల దారి
"ఆజాద్ హింద్"కి జై అన్నా
మూడు రంగుల జెండా నిర్మాణ ప్రదాత వెంకయ్యకు
జై కొట్టినా
నెష్రూ,వల్లభాయ్,నేతాజీ,భగత్ సింగ్ లకు
జేజేలు పలికినా
వందేమాతరం, జనగణ మన గీతాలు ఆలపించినా అంతా నా దేశమే
నా దేశ సర్వోన్ముఖ నినాదమే
యన్.టి.ఆర్,పివి,వెంకయ్యనాయుడు దేశం వన్నె పెంచిన
తెలుగు నిలువెత్తు బావుటాలు
ఈ నాటి ఈ అమృతోత్సవ వేకువలన్నీ
నాడు నేడు పరచుకున్న
అభివృద్ధి వెలుగుల దీపాలు!
భారతమాతా జిందాబాద్!
తెలుగు తల్లి జిందాబాద్!!
--------------------------------------------------------------------------------------------------------------------------
Call 89852 51271 @ EDITOR Dr. Sabbani Laxminarayana
Call 9849250784 for more details on Book.
-----------------------------------------------------------------------------------------------------


No comments:
Post a Comment