Geeta Prakashan Bookswala's Anthology "Operation Sindhur" in Editorialship of "Dr. Sabbani Laxminarayana")
ఇప్పుడక్కడ మనసులు తుపాకులై తిరుగుతున్నయి
మానని గాయాలను తడుముకుంటూ
అల్లకల్లోల సంద్రాలైన మనుషులు
విరుచుకు పడబోయే యుద్ధ సునామీని తలుచుకుంటూ
బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతూ...
మొన్న మొన్నటి దాకా
అందాల సుందరోధ్యానవనమై
ధవళమంచు వలువలతో
కుంకుమ తిలకం దిద్దుకొని పర్యాటకుల
హృదయాలను దోచుకున్న కాశ్మీరం
ఉన్మాదుల ఘాతుకానికి రుధిరంతో తడిచి ముద్దయ్యింది
మాయమైన మనిషితనం కౄర మృగమై
ఆదమరిచిన లేళ్ళను చీల్చి చెండాడింది
నిండు నూరేళ్ళ నుదుటి సింధూరం
కోల్పోయిన మహిళల ఆర్తనాదాలు లోయల్లో ప్రతిధ్వనించి
యావత్ భారత దేశం ఉలిక్కిపడింది
సరిహద్దుల వెంట మతోన్మాదం పిచ్చి కుక్కలా తిరుగుతూ చేస్తున్న దుర్మార్గానికి
బుద్ధి చెప్పలేమన్న ధీమా నదీ
జల దిగ్బంధంతో పటాపంచలై పోయింది
ప్రతిస్పందనకు శాంతి మంత్రం జపిస్తామని
బోరవిరుచుకున్న పాకిస్తాన్ కు
ఊహాతీతంగా డ్రోన్ల పేల్చివేత
ప్రయోగించిన బ్రహ్మోస్ శివుని మూడో నేత్రమై సాగించిన ఎదురు దాడితో
వ్యూహాలను పటాపంచలు చేసి
భారత సైన్యం సత్తా ఏమిటో
ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయేలా చేసింది
సహనం కోల్పోతే అజాత శత్రువే అలిగితే
ఎలా వుంటుందో
పాకిస్తాన్ కు రుచి చూస్తే గాని తెలవలేదు
మోగిన యుద్ద శంఖారావం
మళ్ళీ కయ్యానికి కాలు దువ్వకుండా
దిమ్మతిరిగేలా చేసి
మన దేశ కీర్తి పతాకను ఎగురవేసిన
జవానులకు అమరులైన సైనిక వీరులకు
ప్రపంచమంతా జేజేలు జోహార్లంటూ
వినమ్రంగా చేతులు జోడించింది!
💐💐💐💐💐💐
© వురిమళ్ల సునంద
ఖమ్మం
9441815722
----------------------------------------------------------
------------------------------------------------------------------------------
GEETA PRAKASHAN
Please call us 62818 22363
No comments:
Post a Comment