Geeta Prakashan Bookswala's Anthology "Operation Sindhur" in Editorialship of "Dr. Sabbani Laxminarayana")
అందరిని అక్కున జేర్చుకున్న కడుపు తీపి గల దేశం
అందరూ నా బిడ్డలే అని కులం, మతం వివక్ష చూపని ప్రేమగల దేశం.
ప్రశాంత జీవనాన్ని కోరుకున్న దేశం
సమానత్వం, సౌభ్రాతృత్వం, ధర్మం అనే నడక నేర్చిన దేశం
నా దేశం పై పాపపు దేశం కళ్ళు పడ్డవి
నా దేశ బిడ్డల గుండెలపై తుపాకీ గుండ్లు పేల్చి ప్రాణాలు తీసింది
నా బిడ్డల కళ్ళల్లో కన్నీళ్ళు చూసి
కన్నెర్ర జేసిన భారత దేశం నుదుట దిద్దిన సింధూరం
అర్ధరాత్రి అగ్ని సూర్యుడు అయ్యింది
నిశి రాత్రి నిప్పుల వర్షం కురిపించింది పాపపు దేశంపై
అంతుకు అంతు
తంతుకు తంతు
ఉగ్రవాదులపై ఉగ్ర జ్వాలా
ఉక్కు పిడికిలి బిగించి
దిక్కులన్నీ పిక్కటిల్లేలా ఒక్కసారి ఎగబడింది పాపపు దేశం ముక్కలు ముక్కలు అయ్యేలా
నా వీరులకు వందనం
నా దేశపు బిడ్డలకు వందనం.
నేను ఎప్పుడైనా సిద్దమే
సంధి కైనా,
శాంతి కైనా,
యుద్దానికి అయినా.
జయం మనదే, జయం మనదే!
జయహో భారత్!
సెల్యూట్ ఆపరేషన్ సింధూర్
💐💐💐💐💐💐
© ఛత్రపతి శ్రీనివాస్ తాళ్ళపల్లి
కవి, రచయిత.
83319 92929
----------------------------------------------------------
------------------------------------------------------------------------------
GEETA PRAKASHAN
Please call us 62818 22363

.jpeg)
No comments:
Post a Comment