Geeta Prakashan Bookswala's Anthology "Operation Sindhur" in Editorialship of "Dr. Sabbani Laxminarayana")
పచ్చని లోయల్లో పదునెక్కిన తుపాకీలు చెలరేగిపోయాయి.
ఉత్తరపు కొన ఉలిక్కిపడింది. కోమల కాశ్మీరం కన్నీరు కార్చింది.
అమాయకపు గువ్వల జంట గుండె చెదిరింది.
చల్లని హిమానీ నదాలు వేడెక్కాయి.
ఆడపడుచుల ఆర్తనాదాలతో భరతమాత తల్లడిల్లింది.
ఉరిమిన ఉగ్రవాదం పైన ఉక్కుపాదం మోపాలని ధర్మభూమి తలపోసింది.
ముష్కరులను నామరూపాలు లేకుండా చేయాలని శాంతి కపోతం బలంగా నమ్మింది.
ఏ సింధూరం రక్తంతో తడిసి రంగు మారిందో ఆ సింధూరం ప్రతిన పూని దాయాది పాక్ నీ హెచ్చరించింది.
రోజుల్లోనే పాకీ పభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసి రక్కసి మూకల ఏరివేసి భరత మాత ఆడబిడ్డల
సింధూర శక్తిని ప్రపంచానికి తెలియపరచింది.
జై సింధూరం.
జైజై ఆపరేషన్ సింధూరం
💐💐💐💐💐💐
© జి.హరిత మాధవీలత 'హమాల'
విజయవాడ
93464 37357
----------------------------------------------------------
------------------------------------------------------------------------------
GEETA PRAKASHAN
Please call us 62818 22363

.jpeg)
No comments:
Post a Comment