Geeta Prakashan Bookswala's Anthology "Operation Sindhur" in Editorialship of "Dr. Sabbani Laxminarayana")
భరతమాత నుదుటి సింధూరం
రవి బింబపు అరుణిమ కాశ్మీరం
హిందూ ధర్మపు ప్రాథమిక ఆహార్యం
హిందూ దేశపు ఆడబిడ్డ సింగారం
భారతావని ముద్దుబిడ్డల ఆగ్రహావేశం
ఆదిశక్తి సింధూర అగ్నిజ్వాలల ప్రభావం .
ఎరుగక అబల అని భ్రమసిన నిర్వాకం
ఆడబిడ్డల నుదుటి బొట్టు విలువ పురుషజాతికి ప్రాణప్రదం అని, అమ్మ, అక్క, చెల్లి, ఆలి ఎవరిపైన చేయి కాదు నోరు జారినా జరిగే విధ్వంసం,ముష్కరుల ప్రాణనష్టం .
చెప్పుకో పో ….. అని అంటే చెప్పనవసరం లేదు గాలి వాటుగా వార్త చెవిన పడ్డా జరిగే పరిణామాలు ఊహకు కూడా అందని ఆవేశపూరిత భరత వీరుల శౌర్య ప్రతాపం .
కనివిని ఎరుగని రీతిని రుధిర వరదల కొట్టుకు పోయే అమానుషత్వం.
మరల తిరిగి చూడగానైన సాహసించని రీతిని అణచి వేసిన దురాగతం .
అది భరతమాత బిడ్డలమని చాటి చెప్పిన సైనిక వీరులు ,బిక్షగా ఇచ్చినది పుచ్చుకో,
అతిగా ఆశపడి ఆవేశపడితే, మత ఉన్మాదం ప్రకోపిస్తే ఇక పాడక తప్పదు చరమగీతం .
ఎవరి అండ చూసుకొని ఆడినా,ఆదిశక్తి సింధూరారుణ జ్వాలల మాడి మసి కాక మరి ఇంక ఏమీ మిగలదు జాగ్రత్తా……
అని తేల్చి చెప్పినా……
మానవత్వం మరువని మంచి మార్గం విడువని భారతజాతి పెట్టిన ప్రాణ భిక్ష, ఇంతటితో ఆగిన ధీక్ష
ఇదే ఆపరేషన్ సింథూర్ శ్రీ రామ రక్ష.
💐💐💐💐💐💐
© పి. శ్రీదేవి
9441832111
----------------------------------------------------------
------------------------------------------------------------------------------
GEETA PRAKASHAN
Please call us 62818 22363
No comments:
Post a Comment