(Geeta Prakashan Bookswala's Anthology "Operation Sindhur" in Editorialship of "Dr. Sabbani Laxminarayana")
నా తోబుట్టువుల "నుదుటను" చెరపబడిన "సింధూరం" పెంచెను!
వారి "ఆర్తనాదాలు" భారతీయులలో
కోపం రగిల్చెను! గుండెలలో మండెను బడబాగ్ని!
తోక వంకర "పాక్" పీక నులిమేయాలాని!
కన్నుకు కన్ను! దెబ్బకు దెబ్బ! కొట్టేయాలని!
నా వారికి "ఉపశమనం" కావాలి!
అందుకే "దుష్ట కౌరవుల" వంటి
వందమంది "ఉగ్రవాదుల" పీచ మణచేశాం!
విమానాశ్రయాలను "ధ్వంసం" చేసేశాం!
పాక్ ను "ఛిన్నాభిన్నం" చేసేశాం
"ఆర్ధికంగా" కోలుకోలేని దెబ్బను కొట్టేశాం!!
అంతర్జాతీయంగా "ఏకాకిగ" నిలపేశాం!
మాకు మీరు "సాటికారని" నిరూపించేశాం!!
చావగొట్టి "చెవులు" మూసేశాం!
దేహి! దేహి! అంటూ అందరినీ "యాచించే", స్థాయికి తెచ్చేశాం!!
మరోసారి మనవైపు చూడాలంటేనే
"భయపడేలా" చేసేశాం!
"జలజల" పారే "సింధు" జలాలను ఆపేశాం !
"నీటికి" కూడా "కటకట" లాడేలా చేసేశాం!
"అష్ట దిగ్బంధనం" చేసేశాం!
నీకు "దిక్కున్న చోట" చెప్పుకో ! పొమ్మన్నాం!
బుద్దిలేని "పాక్" ని! బుధ్ధిరాని పాక్ "ని!
💐💐💐💐💐💐
© మల్లాది సోమేశ్వర శర్మ
తెలుగు ఉపన్యాసకులు,
ఆదిత్యా మహిళా డిగ్రీకాలేజీ,
రాంనగర్, విశాఖ పట్టణం
9494147975
----------------------------------------------------------
------------------------------------------------------------------------------
GEETA PRAKASHAN
Please call us 62818 22363
No comments:
Post a Comment