(Geeta Prakashan Bookswala's Anthology "Operation Sindhur" in Editorialship of "Dr. Sabbani Laxminarayana")
ఎవడువాడు దుండగీడు పాడుబుద్ధి కలగినోడు
పహల్గమ్ సీమలోన ద్రోహము తలపెట్టినోడు
అందమైన కాశ్మీరం కబళింపగ చూసినోడు
సుందరమగు ధరణి దోచ పాత పగను చూపినాడు
సహనముతో మనముంటే బలహీనముగా నెంచెను
ఆనందపు పుడమి పైన విషాదాన్ని కలిగించెను
తుపాకీలు మ్రోగించెను పాశవికతను చూపించెకు
మంచుపూల తోటలోన దౌర్జన్యము సాగించెను
శాంతిగున్న సమయయందు అశాంతినే కలిగించెను
కవ్వించే పనులు చూసి నివ్వెరపోయెకు భారతి
దొంగ చాటు యుద్ధానికి దొరలాగా బుద్ది చెప్పె
ఆపరేషన్ సింధూరం ఆయుధమాయెను మనకు
గుంట నక్క పాకిస్తాన్ తోకముడిచి పారిపోయె
జేగంటలు మ్రోగినాయి జయహా భారతియంటూ
కోతలు కోసిన శత్రువు శరణువేడి మోకరిల్లె
భారతీయ సైన్యానికి బానిసగా మారిపోమే
బందూకులు వాడివైతే సింధూరం మనదాయెను
బ్రహ్మస్త్రము వాడగానే వాడి గుండె దిగజారెను
ధర్మయుద్ధమే మనది వీరులు మన జవానులు
జై జవాను జై హిందను నినాదమే మనది !
💐💐💐💐💐💐
© కల్వకోట వేంకట సంతోష్ బాబు
కరీంనగర్
98490 85727
----------------------------------------------------------
------------------------------------------------------------------------------
GEETA PRAKASHAN
Please call us 62818 22363
No comments:
Post a Comment