Geeta Prakashan Bookswala's Anthology "Operation Sindhur" in Editorialship of "Dr. Sabbani Laxminarayana")
భరతమాత చల్లని చూపుల నుండి జాలువారిని పసుపు కుంకుమ భరతమాత బిడ్డల నుదుటి కుంకుమ.
ఆడపడుచుల కన్నీటిబడబాగ్నిలో దహించి పో నవయుగ రావణుడిలా
ఓ పోరాటయోధుడా వాయు పుత్రుడు వై తల్లి భూమి భారతి పైన చేయి వేసిన రాక్షస సైన్యాన్ని తరిమి తరిమి రణభూమిని దడ దడ లాడించు.
భరత భూమిపై సింధూరం ధరించే సీతాదేవి లాంటి శాంతమూర్తిలే కాదు చీల్చి చెండాడే కాళికాదేవి కూడా జన్మించిన పవిత్ర భూమి రా నా భారతదేశం.
కల్నల్ కాళీక అవతార ఎత్తితే యుద్ధభూమిలో రక్తము ఏరులై పారెను.
ఆడపడుచుల ఆత్మఘోష కు ప్రతిరూపమే పాకిస్థాన్లో పారుతున్న రక్తపు జలపాతం.
రక్తంతో తడిచిన నేల రౌద్రమై కన్నెర్ర చేస్తే దాన్ని ప్రతిఫలమే సింధూర్.
జాతి మత విరోధాలు లేకుండా స్నేహ సన్నిహిత్యం అనే వెన్నెలలో విహరిస్తున్న నాగరీకుల మధ్య చిచ్చుపెట్టినావు. ఆ అగ్ని గుండంలో దహించి పోయినావు.
ప్రళయ కాలంలో కాలభైరవునిలా, సైంధవుని చంపేవేళ అర్జునుడిలా, కౌరవ సైన్యంలో గదా పట్టుకొని విజృంభించిన భీముడిలా, రాక్షస వద చేసిన రామునిలా........ భారత సైన్యం యుద్ధ భూమిలో విహరిస్తుంది.
వందేమాతరం! వందేమాతరం!
💐💐💐💐💐💐
© సంధ్య వడ్లమూడి
9063626333
----------------------------------------------------------
------------------------------------------------------------------------------
GEETA PRAKASHAN
Please call us 62818 22363
No comments:
Post a Comment