Friday, August 26

భారతీయ వీరులం - బాదేపల్లి వెంకటయ్యగౌడ్ (DESH BHAKTI - T)

  (DESH BHAKTI)


భారతీయ వీరులం
**************

ఘనత కలిగిన చరిత మనది
చైతన్య భరిత జనత మనది
ముష్కర మూకల వెన్నులో 
వణుకు పుట్టించే వీరత్వం మనది
మానవీయత మూర్తీభవించిన
మహోన్నత దేశం మనది 
వందేమాతరం 
మన హృదయ నినాదం ..
అఖండ భారతం 
మన ఆత్మగౌరవ పతాకం ..

త్యాగధనుల రక్తంతో
 తడిసిన దేశమాత 
మట్టి రేణువుల నుండి ఉద్భవించిన 
భరతమాత పౌరుషాగ్నులం  ..

వేద వేదాంగ 
పురాణ విద్వత్తునంతా
ఏకబిగిన ఔపోసన 
పట్టి ప్రపంచానికి 
జ్ఞానభిక్ష ప్రసాదించిన 
జ్ఞాన సూర్యులం ...

విదేశీయులెందరో దేశపువసారాలోకి  
అడుగు మోపినంతనే 
అతిథి అభ్యాగతులుగా ఆదరించి 
హృదయ పీఠం పై ఆశ్రయమిచ్చిన 
సంస్కార చంద్రులం ...

బ్రిటిష్ సామ్రాజ్య 
దురహంకార 
పాలనను ప్రతిఘటిస్తూ ..
సత్యాగ్రహ ఉద్యమంతో 
స్వేచ్ఛ వాయువులను  ప్రసరింపచేసిన బాపూజీ అడుగుజాడలం ..

కన్నుకు కన్ను పన్ను పన్ను యంటూ సమర రంగాన కొదమసింహమై  గర్జించి.. ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి తెల్లొల్లకు పక్కలో బల్లెమై నిలిచిన సుభాష్ బోసు సంగాతకులం ...

మూఢనమ్మకాల 
కట్టుబాట్లను ఎదిరిస్తూ ..
అక్షర కిరణం దారుల్లో 
అజ్ఞాన తిమిరాన్ని అదిలిస్తూ .. 
జాతి ప్రజలను ప్రజ్ఞావంతులుగావిస్తూ..
సత్యశోధనతో సామాజిక పరివర్తన గావించిన మహాత్మజ్యోతిరావు పూలే దంపతుల వారసులం ....

చిరు ప్రాయంలోనే 
ప్రాణాల్ని తృణప్రాయంగా భావించి 
ఇంక్విలాబ్ జిందాబాద్ యంటూ నినదిస్తూ.. 
దేశమాత సేవలో ప్రాణార్పణ గావించిన భగత సింగ్ రాజేసిన నిప్పురవ్వలం ..

అన్నెం పున్నెం 
ఎరుగని మన్యపు 
ప్రజలకు అండగా నిలిచి ..
తెల్లదొరల అకృత్యాలకు
కళ్లెలు బిగించి.. 
తెలుగువీర లేవరా 
దీక్షబూని 
సాగరాయంటూ .. 
మన్యపు ప్రజలను 
జాగృత పరిచిన 
మన్యం వీరుడు అల్లూరి
 విప్లవ జ్యోతులం ...

భుజబలంతో 
బుద్ధిబలంతో 
సమరసింహాలై గర్జిస్తూ...
శత్రువుల 
కుత్తుకలను 
తునాతునకలు చేస్తూ.. 
కదన రంగాన 
కాళికారూపులై చెలరేగిన
వీరనారి 
ఝాన్సీ లక్ష్మీబాయి  రుద్రమదేవీల 
సహచరులం ..

అణగారిన వర్గాల్లో అగ్ని రూపమై ప్రజ్వరిల్లుతూ.. నిమ్నజాతి ఉద్ధరణే ఉచ్ఛ్వాస నిశ్వాసలు గా భావిస్తూ.. అంటరానితనమనే కబంధ హస్తాలను ఛేదించుకుంటూ విరామమెరుగక పరిశ్రమిస్తూ .. భరత జాతి భవితవ్యానికై 
రాజ్యాంగాన్ని రచించిన డా. బి ఆర్ అంబేద్కర్ అనుచరులం ..

పుంఖానుపుంఖాలుగా వినూత్న ప్రక్రియలో గ్రంథాలను వెలువరిస్తూ.. బాల్య వివాహా శిలా బంధాలను ప్రతిఘటిస్తూ.. వితంతు వివాహాలను బాలికా విద్యను ప్రోత్సహిస్తూ ..
తెలుగు సాహితీ కళామతల్లికి నేత్రద్వయమై నిలిచిన కందుకూరి  సురవరం మైత్రేయులం ..

తరతరాల నుండి భరతజాతి కీర్తిచంద్రికలను ఖండాంతరాలకు వ్యాపింప జేస్తున్న భారతీయ వీరులం.. దేశమాతను విచ్చిన్నం చేసే శత్రువుల కుత్తుకలను తెగనరికే సానబట్టిన కరవాలాలం ...

జాతి ప్రజలను అవహేళన చేసే
ముష్కరాధములను మట్టి కరిపించే భరతమాత పౌరుషాగ్ని శతఘ్నులం ..
భరతమాత బిడ్డలం ...
భారతీయతకు కంకణబద్దులం.
స్వతంత్ర భారత వజ్రోత్సవ సంబరాన ..
జయకేతన మెగరేయుచున్న
భారతీయ వీరులం ..
భవ్యమైన వెలుగు దివ్వెలం .. 


బాదేపల్లి వెంకటయ్యగౌడ్
మహబూబ్ నగర్
9948508939

--------------------------------------------------------------------------------------------




--------------------------------------------------------------------------------------------------------------------------

Call 94410 89035 @ EDITOR - M N VIJAYA KUMAR

Call 9849250784 for more details on Book. 
to join us ...click here
https://chat.whatsapp.com/EiIOZhl7ZMwEzWFFwtZlJv
-----------------------------------------------

Let's celebrate Independence day to salute nation with our own words in edited book DESH BHAKTI by M N VIJAYA KUMAR 

Don't miss this golden opportunity to salute nation with your own writing in your own language.. 

Please join and share with your friends....
Let's dedicate our pen for nation....

GENERAL poems theme in Hindi, or English or Telugu

Membership to join
Just 500.00

Members will be given
 2 Books with ISBN, Blog page, Youtube  video 

Let's gain Name and Fame in single click...

https://chat.whatsapp.com/EiIOZhl7ZMwEzWFFwtZlJv
Call 9849250784 for more information

-----------------------------------------------------------------------------------------------------


scan to see on youtube



scan to join on WhatsApp




BOOK PUBLISHED BY :

GEETA PRAKASHAN

INDIA

Cell 98492 50784

geetaprakashan7@gmail.com

---------------------------------------------------------------------------------

do you want to publish your writing through our BLOGPAGE ?

Please call us 62818 22363

No comments:

Post a Comment

सुनील का संघर्ष और सफलता - (Geeta Prakashan Bookswala's Anthology "रंग - अक्षरों के")

    (Geeta Prakashan Bookswala's Anthology "रंग - अक्षरों के") सुनील का संघर्ष और सफलता 💐.......................................