(Bharat Ki Azadi Ka Amruth Mahotsav)
విశ్వ ప్రాకారం
స్వాతంత్య్రానికి దేశీయత చోదక శక్తిగా వెలుగు లీనిన సందర్భానఉత్ప్రేరకం లోకహితమై సార్వభౌమాధికారమై పరిఢవిల్లుతూనే ఉంది'ఆజాదీ కా అమృతోత్సవ్' అన్న పిలుపే ప్రభంజనంగా.ప్రేరణయై నిలిచిన స్వాతంత్ర్య సమరోద్యమంఅభివృద్ధే ప్రగతి సూత్రంగా విస్తారమై విస్తృతమవుతూ దేశభక్తిలోని భక్తి మూలం అవిభాజ్యం కాగలుగుతూనే ఉంది క్రొంగొత్త ప్రణాళికలు, ఆలోచనలు, సమగ్రతా సూత్రంగాఎలుగెత్తిన జాతీయవాదం విశ్వ ప్రాకారాన మెరుపులీనుతుంది సారస్వతమే విధి విధానంగా డెబ్బై ఐదేళ్ల స్వేచ్ఛ అవనికి ఆలంబనగా అనేక నైజాల దేశీయ దృక్కోణం స్వావలంబనగా కృతకం కానేరని చోదక ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూనే ఉందిఅఖండమైన రాజ్యాంగం, రాజతంత్రం, హేతుబద్ధ జాతి నిర్మాణం జీవనేచ్చలోని సామ్యవాదం, సామ్యవాదాన్ని ప్రకటిస్తూనే ఉంది మన దేశం, మనజెండా,మన జాతి, మన మనుగడ ఎలుగెత్తిన ఎజెండా దృశ్యమానమై సమైక్యత సూత్రాన్ని వల్లె వేస్తుంటేఆత్మాభిమానాన, ఆత్మానందమై పౌరుషమై ఎగిరిన జాతి జెండా రెపరెపలే నైసర్గికంగా, దేశ మనుగడే సమగ్రతావాదంగా చేయి చేయి కలిపినప్పటి స్వాంతన నిండిన జాతి నుడికారం'ఆజాదీ కా అమృతోత్సవ' పిలుపు రసరంజితంగా నిలుపుతూనే ఉంది
వడలి రాధకృష్ణ ℅ ITC Limited- ABD ILTD,. చీరాల - 523157. ప్రకాశం జిల్లా (ఆంధ్ర ప్రదేశ్)
మొబైల్: 9985336444--------------------------------------------------------------------------------------------------------------------------
Call 89852 51271 @ EDITOR Dr. Sabbani Laxminarayana
Call 9849250784 for more details on Book.
-----------------------------------------------------------------------------------------------------


No comments:
Post a Comment