Geeta Prakashan Bookswala's Anthology "Operation Sindhur" in Editorialship of "Dr. Sabbani Laxminarayana")
కన్నీరెట్టుకోకు తల్లీ కలవరపడిపోమాకు
ఓ బిడ్డ పానం పోయిందనీ
ఓ పిల్ల సిందూరం సెదిరిందనీ
మనసుతనం లేని మూర్కులు
సమ్మతం కాని మతపుటాలోచనలో
తుపాకీలను ఎక్కుపెట్టి తూటాలను గుండెల్ల దింపి
కసాయితనం కురిపించినారనీ
చిందిన ప్రతి రక్తపు బొట్టు
తిరుగుబడుతుంది నీ మీదొట్టు
కారిన ప్రతి కన్నీటి సుక్క సరిచేస్తాది ప్రతీకార లెక్క
అమ్మనిగన్న అమ్మవి నువ్వు
చెరగనీయము నీ చిరునవ్వు
పుల్లా పుడకా మారణాయుధమై
గాలీ నీరూ దుమారాలై పిల్లా జెల్లా ..ముసలీ ముతకా
కంకణం కట్టుకుని ఏకమై వీర జవానుకి వెన్ను దన్నై
జన్మభూమికి రక్షణ కవచమై
ఏకతాటిపై నిలబడే సమయమాసన్నమైంది
ప్రతి ఇంటా ప్రతి గుండె రగిలి రగిలిపోతోంది
అసువులు బాసిన వారికోసం తల్లడిల్లి పోతోంది
ఉగ్రవాదం మంటగలిపే రోజు దగ్గరలోనే ఉంది
ఉన్మాదుల పీచమణిచే గడియ సమీపిస్తోంది
త్యాగాల ఈ నేల తృప్తిగా నవ్వంగ
మువ్వన్నెల వీర పతాకం గర్వంగా రెపరెపలాడంగ
వీరులగన్న నీ కడుపు సల్లగుండ
మా పానాలె నీకు ఎర్ర మల్లెలదండ
💐💐💐💐💐💐
© పద్మిని కాజ
తిరుపతి, ఆంధ్రప్రదేశ్
9441644493
------------------------------------------------------------------------------
GEETA PRAKASHAN
Please call us 62818 22363
It's a Tribute to the people who sacrifices their Lives to the Mother country.
ReplyDeleteIt's very well written. Hearty congratulations to you dear Padmini. You are indeed very creative.
ReplyDeleteThis poem is full of emotions. It reminds us of the great sacrifices made by our brave soldiers. Thank you Padmini madam Garu for writing such meaningful lines..
ReplyDeleteExcellent mam 👌👌👌🙏🙏🙏
ReplyDeleteProf. Padmini madam garu....Excellent kavitha....Ide kada prathi bharathiyuni hrudaya spandana...Johar to your veera kavitha...On behalf of all Indians, veera kaviki Erra Mallela Mala...pl accept it....Prof. Mamilla Rajasekhar, Oka Bharathiyudu...
ReplyDelete